తెలంగాణ

telangana

ETV Bharat / priya

Chocolate Cake: కివీ పండుతో చాక్లెట్ కేక్- ఇలా చేయండి!

మీకు చాక్లెట్​ ఫ్లేవర్​ ఇష్టామా? దానితో తయారు చేసిన కేక్​ను మరింత ఇష్టంగా తినేస్తారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. ట్రై చేసేయండి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్లకు తినిపించి మార్కులు కొట్టేయండి!

Chocolate Kiwi Pancake
చాక్లెట్ కివీ పాన్ కేక్

By

Published : Sep 3, 2021, 4:25 PM IST

కేక్ తినాలంటే బేకరీకి వెళ్లాలి. అక్కడున్న వాటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలి. ఒకవేళ అది నచ్చకపోతే నిరాశపడాలి. ఇలా బాధపడే కంటే మన ఇంట్లోనే, అందుబాటులోని వస్తువులతో కేక్​ చేసుకుంటే, దాని టేస్ట్ అదిరిపోతే.. సూపర్​ కదా! మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ చాక్లెట్ కివీ పాన్ కేక్(Chocolate Kiwi Pancake)​ ట్రై చేసేయండి.

కావాల్సిన పదార్థాలు

కివీ పండ్లు(kiwi fruit), గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, చాక్లెట్ సిరప్, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, నూనె

తయారీ విధానం..

ముందుగా కివీ పళ్లను(kiwi pancakes) తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఓ బౌల్​లో తీసుకుని మెత్తగా చేసుకోవాలి. అందులో గోధుమపిండి, ఉల్లిపాయ ముక్కలు, చాక్లెట్ సిరప్, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, నూనె వేసి బాగా కలుపుకోవాలి.

మరోవైపు స్టవ్​ వెలిగించి ఓ కడాయి పెట్టి, అందులో కొంచెం నూనె పోసుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ కడాయిలో పాన్ కేక్​లో వేసుకోవాలి. దానిని రెండు వైపులా కాల్చి ఓ ప్లేట్​లో తీసుకుంటే సరి. ఎంతో రుచికరమైన 'చాక్లెట్ కివీ పాన్ కేక్​'(kiwi chocolate cake)రెడీ.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details