చపాతీలను ఎన్నో రకాలుగా చేయొచ్చు. మరెన్నో రుచులతో తయారు చేసుకోవచ్చు. అలాంటి వెరైటీ వంటకమే.. 'చిల్లీ పరోటా'(Chilly Parotta Recipe). దీనిని వంటిట్లో అందుబాటులో ఉండే సాధారణ పదార్థాలతో హోటల్ టేస్ట్(Parotta Recipe) వచ్చేలా తయారు చేసుకోవచ్చు. అదేలాగో మీరే చూసి.. చేసేయండి. ఉదయం లేదా సాయంత్రం లొట్టలేసుకుంటూ తినేయండి.
కావాల్సిన పదార్థాలు..
గోధుమపిండి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, గరం మసాలా, ఛాట్ మసాలా, కలోంజి, కొత్తిమీర, ఉప్పు(తగినంత), నూనె(తగినంత).
తయారీ విధానం..
ముందుగా స్టవ్‌పై ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె పోయాలి. నూనె వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు(తగినంత) వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమం కొద్దిసేపు వేగిన తర్వాత గరం మసాలా, ఛాట్ మసాలా, కలోంజి వేసి కలుపుకొని కొద్దిసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఓ బౌల్లో గోధుమ పిండి, కొత్తిమీర, ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి మిశ్రమం వేసి కలుపుకొని.. కొంచెం కొంచెంగా నీరు పోస్తూ, పిండిని ముద్దగా కలపాలి. దానిపై నూనె రాసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. కొద్దిసేపటి తర్వాత పిండిని చిన్ని చిన్ని ఉండలుగా చేసుకొని.. పరోటాలుగా వత్తుకుని పెనంపై నూనె సహాయంతో రెండువైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత పరాటాలను ప్లేట్లోకి తీసుకొని.. రైతాతో తింటే చాలా బాగుంటుంది.
ఇదీ చూడండి..3 పరోటాలు తింటే రూ.లక్ష ప్రైజ్.. జీవితాంతం భోజనం ఫ్రీ!