తెలంగాణ

telangana

ETV Bharat / priya

'చిక్కుడు- చికెన్‌ పలావ్‌' సింపుల్ రెసిపీ! - chicken with chikkudu kayarecipe

చిక్కుడుకాయను ఎప్పుడూ ఒకేలా వండుకుంటే బోరు కదా... అందుకే ఈసారి చిక్కుడును చికెన్ పలావ్​తో జత చేసి చూడండి. చిక్కుడు-చికెన్ పలావ్ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి.

chikkdu chicken pulav recipe at home
'చిక్కుడు-చికెన్‌ పలావ్‌' సింపుల్ రెసిపీ!

By

Published : Oct 1, 2020, 1:00 PM IST

రకరకాల పలావ్​లు తినే ఉంటారు. కానీ చిక్కుడు చికెన్ పలావ్​ ఎప్పుడైనా తిన్నారా? చిక్కుడు చికెన్ పలావ్ రెసిపీ చేసుకోవడం ఎంతో ఈజీ..

కావాల్సినవి

బాస్మతి బియ్యం: పావుకిలో

చిక్కుడు గింజలు: పావుకిలో

బోన్‌లెస్‌ చికెన్‌: పావుకిలో

నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు

నూనె: టేబుల్‌స్పూను

ఉల్లిపాయ: ఒకటి

వెల్లుల్లిరెబ్బలు: నాలుగు (సన్నగా తరగాలి)

జీలకర్ర: ఒకటిన్నర టీస్పూన్లు

దాల్చినచెక్క: అంగుళంముక్క

పసుపు: టీస్పూను

కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను

గరంమసాలా: టీస్పూను

ఉప్పు: తగినంత

తయారీ

బియ్యం కడిగి ఉంచాలి. పాన్‌లో సగం నెయ్యి, నూనె వేసి పసుపు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, దాల్చినచెక్క ముక్కలు వేసి వేగాక చికెన్‌ముక్కలు వేసి వేయించాలి.

కాస్త వేగాక చిక్కుడు గింజలు వేసి వేయించాలి. బియ్యం వేసి కలిపి సరిపడా నీళ్లు పోసి, గరంమసాలా కూడా వేసి మూతపెట్టి ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము, మిగిలిన నెయ్యి వేసి కలిపి దించాలి.

ఇదీ చదవండి:'చైనీస్ చికెన్‌ మంచూరియా' ఇలా చేసి చూడాలయా..

ABOUT THE AUTHOR

...view details