ఇడ్లీలను చట్నీ, సాంబారుతో లాగించేయడమే మనకు అలవాటు. మరి చికెన్‌తో (chicken recipes) ఎప్పుడైనా ట్రై చేశారా? కొంచెం ఓపిక ఉండి, ఇడ్లీలను ఎంతో రుచికరమైన కర్రీతో తినాలనుకుంటే ఓ సారి చికెన్ వడా కర్రీ ప్రయత్నించండి.
కావాల్సిన పదార్థాలు:
ఇడ్లీ పిండి, చికెన్ కీమా, శనగపప్పు, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కారం, గరం మసాలా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సోంప్, ఉల్లిపాయాలు, పసుపు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, టమాటా ముక్కలు, జీడిపప్పు పొడి.
తయారీ విధానం:
ముందుగా ఇడ్లీ పిండిలో ఉప్పు వేసి.. చక్కగా కలిపాలి. తర్వాత దాన్ని ఇడ్లీ మౌల్డ్‌లో వేసి 10నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
వడలు చేయడానికి మిక్సీ జార్లో.. నానబెట్టిన శనగపప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఒక బౌల్లో వేసి ఉప్పు, కొత్తిమీర, పచ్చి మిరపకాయలు, కారం, గరం మసాలా వేయాలి. ఆ తర్వాత చికెన్ కీమా కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా వేడి నూనెలుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక ప్యాన్‌లో నూనె వేడిక్కిన తర్వాత అందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సోంప్, సన్నగా తరిగిన ఉల్లిపాయాలు, కొంచెం ఉప్పు వేసి కొద్దిగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, టమాటా ముక్కలతో పాటు కొన్ని నీళ్లు పోసి ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి మిరపకాయ ముక్కలు, మరి కొన్ని నీళ్లు పోసి దాంట్లో జీడిపప్పు పొడి వేసి బాయిల్ చేసుకోవాలి.
ఎప్పుడైతే గ్రేవీ మంచి సువాసన వస్తుందో ఉప్పు అడ్జెస్ట్ చేసుకొని అందులో చికెన్ వడలు వేయించాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఇక అందులో వేడివేడి ఇడ్లీలతో తింటే అదిరిపోతుంది.
ఇదీ చూడండి:వెజ్.. నాన్ వెజ్ కలిపి ఇలా వండేయండి!