తెలంగాణ

telangana

ETV Bharat / priya

రెస్టారెంట్​ స్టైల్​లో 'పెప్పర్​ చికెన్​ ఫ్రై'.. ట్రై చేయండిలా!

చికెన్​ ఎలా వండినా.. రుచిగానే ఉంటుంది. అయితే రెస్టారెంట్​ స్టైల్​లో ఉంటేనే తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. మరి ఆ స్టైల్​లో ఇంట్లోనే 'పెప్పర్​ చికెన్ ఫ్రై' చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూసి చేసేయండి.

pepper Chicken fray
పెప్పర్​ చికెన్​ ఫ్రై

By

Published : Aug 31, 2021, 7:00 AM IST

ఎన్ని కూరలున్నా నాన్​వెజ్​కు​ ఉండే క్రేజ్​ వేరు. అందులో చికెన్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఆ చికెన్​ను ఎప్పుడూ ఒకేలా చేస్తే తినాలంటే.. బోరు కొడుతుంది. అందుకే కాస్త డిఫరెంట్​గా రెస్టారెంట్​ స్టైల్​లో 'పెప్పర్​ చికెన్​ ఫ్రై' చేసుకోండిలా..

కావాల్సినవి

బోన్​లెస్​ చికెన్​, పుదీనా, కొత్తిమీర, పచ్చి మిర్చి, కారం, అల్లం-వెల్లుల్లి పేస్ట్​, ఉప్పు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, గుడ్డు, బియ్యం పిండి, మైదా పిండి, కార్న్​ఫ్లోర్​.

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో కట్​ చేసుకున్న చికెన్​ ముక్కలు, కట్​ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చి మిర్చి, కారం, అల్లం-వెల్లుల్లి పేస్ట్​, ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక పాన్​లో మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగిన తర్వాత చాపింగ్​ బోర్డ్​పైన వేసి కొంచెం ఉప్పు కలిపి క్రష్​ చేసుకోవాలి. తర్వాత చికెన్​ ఉన్న బౌల్​లో క్రష్​ చేసిన మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క పొడి వేసి.. కార్న్​ఫ్లోర్​, మైదా పిండి, బియ్యం పిండి, ఓ కోడిగుడ్డు వేసి కలుపుకోవాలి.

ఇప్పుడు ఒక పాన్​లో నూనె వేడెక్కాక అందులో అన్ని కలిపి పెట్టుకున్న చికెన్​ ముక్కలు వేసి.. ఫ్రై చేసుకుంటే రెస్టారెంట్​ స్టైల్​లో క్రిస్పీగా పెప్పర్​ చికెన్​ రెడీ అవుతుంది.

ఇదీ చూడండి:ప్రాన్స్ 65.. రుచిగా.. కరకరలాడుతూ..

ABOUT THE AUTHOR

...view details