రసం అనేది సాధారణంగా మిరియాలు, చింతపండుతో చేస్తారు. కానీ చికెన్‌తో చేయడంలోనే అసలు మజా ఉంది. అన్ని రకాల వయసుల వారికి వ్యాధి నిరోధక శక్తిని పెంచే రెసిపీ రసం! కానీ కొంతమందికి నచ్చదు. అలాంటి వారికి కొత్తగా నాన్‌వెజ్‌తో రసం చేస్తే ఇష్టంగా తింటారు. కొద్దిగా వెరైటీగా చేయాలి అనుకున్న వారు చికెన్‌తో చేస్తారు. దానిని తయారీ విధానం ఎలానో ఓసారి చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
- చికెన్ బోన్‌లెస్ ముక్కలు 10 గ్రాములు
- చిన్నగా తరిగిన ఉల్లిపాయలు పావు కప్పు
- టమాటా గుజ్జు సగం కప్పు
- పసుపు పావు స్పూన్
- కారం సగం స్పూన్
- ఉప్పు సరిపడా
- చిన్నగా తరిగిన అల్లం ఒక స్పూన్
- చిన్నగా తరిగిన వెల్లుల్లి ఒక స్పూన్
- కరివేపాకు కొద్దిగా
- పచ్చిమిర్చి ఒక స్పూన్
- లెమన్ జ్యూస్ సగం స్పూన్
- కొత్తిమేర పావు కప్పు
- చింతపండు రసం పావు కప్పు
- మిరియాల పొడి సగం స్పూన్