తెలంగాణ

telangana

ETV Bharat / priya

సండే స్పెషల్​ 'మండీ' బిర్యానీని ఇంట్లో చేసుకోండిలా.

బిర్యానీల్లో ఎన్నో రకాలు ఉన్నా.. దేనికి అవే సాటి. అయితే ఇటీవల కాలంలో చాలామంది మండీ బిర్యానీకి ఫిదా అయిపోతున్నారు. ఫ్రెండ్స్​, ఫ్యామిలీతో హోటళ్లకు వెళ్లి తెగ తినేస్తున్నారు. అయితే ఆ అనుభూతిని ఇంట్లో కూడా పొందగలం. ఇవాళ ఆదివారం కదా.. ఓ సారి ఈ మండీ బిర్యానీని ఇలా ట్రై చేయండి..

Mandi biryani
మండీ' బిర్యానీ

By

Published : Sep 12, 2021, 8:49 AM IST

ఎంతో మంది ఆహార ప్రియులకు బిర్యానీ ఫేవరెట్​ ఫుడ్​. గల్ఫ్​ దేశాల్లో ప్రత్యేకంగా లభించే ఈ వంటకం ఇటీవల కాలంలో ట్రెండీగా మారిపోయింది. యువత, ఫ్యామిలీ.. ప్రతిఒక్కరూ దీనికే ఆకర్షితులవుతున్నారు. అయితే దీన్ని ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారుచేసుకోవాలంటే..

కావాల్సినవి

చికెన్​, బాస్మతీ రైస్​, నూనె, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, సరిపడా నీళ్లు, ఉప్పు, నెయ్యి, కిస్​మిస్​, జీడిపప్పు, టొమాటొ

మండిబిర్యానీ మసాలా తయారీ

ధనియాలు- 1 టీస్పూన్​ , జీలకర్ర- 1 టీస్పూన్​, యాలకులు- 1 టీస్పూన్​ , దాల్చిన చెక్క- 1 టీస్పూన్​ , లవంగాలు- 1 టీస్పూన్​ , బిర్యానీ ఆకు, ఎండు మిరపకాయలు

తయారీ విధానం

ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్​లో నూనె వేడి చేసుకొని, అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు, పుదీనా, కొత్తిమీర, సరిపడా నీళ్లు, ఉప్పు, ముందుగా కట్​ చేసుకున్న చికెన్​ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీజార్​ తీసుకుని, అందులో ఎండుమిరపకాయలు, ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి ఫైన్​ పౌడర్​ చేసుకోవాలి.

ఆ తర్వాత మనం ఉడికించుకుంటున్న చికెన్​ మిశ్రమంలో మిక్సీ పట్టుకున్న పౌడర్​ వేసి మళ్లీ ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్​లోకి ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలని తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్​ తీసుకొని, అందులో పెరుగు, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా, సరిపడా నీళ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత చికెన్​ ముక్కలకు అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక పాన్​లో నూనె వేడి చేసుకొని, ముందుగా మసాలా పట్టించుకున్న చికెన్​ను డీప్​ ప్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్​ తీసుకొని ముందుగా ఉడికించుకున్న చికెన్​ స్టాక్​ను సెపరేట్​ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్​ తీసుకొని అందులో నెయ్యివేడి చేసుకొని సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సరిపడా ఉప్పు, కిస్​మిస్​, జీడీపప్పు, టొమాటొ ప్యూరి, ముందుగా రెడీ చేసుకున్న స్టాక్​ వేసి మూతపెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్​ స్టాక్​ ఉడుకుతూ ఉండగా.. నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసి మూతపెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే మండిరైస్​ రెడీ.. మండి రైస్​తో పాటు ప్రై చేసుకున్న చికెన్​ను సర్వ్​ చేసుకుంటే మండి బిర్యానీ రెడీ.

ఇదీ చూడండి:చిల్లీ పన్నీర్.. సాయంత్రం వేళ గరంగరంగా!

ABOUT THE AUTHOR

...view details