Chicken Recipes : సండే వచ్చిందంటే.. నాన్‌వెజ్ ప్రియులకు పండగ అన్నట్లే. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్.. అంటూ ఏదో ఒకరకం వండుకుంటారు. అయితే.. చికెన్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇసారి కొత్తగా ట్రై చేయండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
దహీ మసాలా కర్రీ:
Chicken Dahi Masala Curry:
కావలసిన పదార్థాలు:
- చికెన్: అరకేజీ
- పెరుగు: కప్పు
- అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు
- పచ్చిమిర్చి ముద్ద: చెంచా
- జీలకర్రపొడి: టేబుల్‌స్పూన్
- మిరియాలపొడి: చెంచా
- గరంమసాలా: అరచెంచా
- పసుపు: అరచెంచా
- ఉప్పు: తగినంత
- నెయ్యి: పావుకప్పు
- టొమాటోలు: రెండు
- ఉల్లిపాయలు: రెండు
- జీడిపప్పు ముద్ద: రెండు చెంచాలు
- పచ్చిమిర్చి: మూడు
- గోరువెచ్చని నీళ్లు: కప్పు
- కసూరీమేథీ: చెంచా
- కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.
పనీర్‌తో ఈ స్నాక్స్ ట్రై చేయండి- పిల్లలు నుంచి పెద్దల వరకు ఆహా అనడం ఖాయం!
తయారీ విధానం:
- ఓ గిన్నెలో పెరుగు, అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్రపొడి, మిరియాలపొడి, గరంమసాలా, పసుపు, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద, చికెన్ ముక్కలు వేసి అన్నింటినీ కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయముక్కలు, టమాట తరుగు వేయించాలి.
- తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి ఓసారి వేయించి స్టౌని సిమ్‌లో పెట్టాలి.
- అయిదు నిమిషాల తర్వాత జీడిపప్పు ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, మరికొంచెం ఉప్పు, గోరువెచ్చని నీళ్లు పోసి మూత పెట్టాలి.
- చికెన్ ఉడికాక కొత్తిమీర తరుగు, కసూరీమేథీ వేసి దింపేయాలి. అంతే నోరూరే దహీ మసాలా కర్రీ రెడీ..
నోరూరించే పులావ్- ఇలా చేశారంటే వహ్వా అంటూ ప్లేట్లు నాకాల్సిందే!
సుక్కా చికెన్ మసాలా: