యమ్మీ యమ్మీ చికెన్ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
బోన్లెస్ చికెన్- 100 గ్రా, గుడ్డు- ఒకటి, పసుపు, ఉప్పు, కారం- తగినంత, ఉల్లిపాయ ముక్కలు- రెండు చెంచాలు, జీలకర్ర- పావు చెంచా, అల్లం తరుగు- పావు చెంచా, పచ్చిమిర్చి తరుగు- అరచెంచా, నూనె- తగినంత
తయారీ:ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, చికెన్ వీటన్నింటిని చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, చికెన్, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పాన్లో నూనె వేసుకొని అందులో గుడ్డు పగలకొట్టి అట్టు పోసుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని రోల్లా చుట్టుకుంటే సరి. సరికొత్త రుచితో చికెన్ ఆమ్లెట్ రెడీ.
ఇదీ చదవండి:ప్రతి మండలానికి ఒక ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది: హోంమంత్రి