తెలంగాణ

telangana

ETV Bharat / priya

Chakkara Pongal recipe: నోరూరించే చక్కెర పొంగళి - sweet recipe

ఎప్పుడూ స్పైసీ, హాట్​ రెసిపీలు చేసుకుని తినే మనం అప్పుడప్పడూ సీట్​ పదార్థాలు కూడా తింటుండాలి. అప్పుడే పొట్టను సంతృప్తి పరచొచ్చు. అలాంటి రుచికరమైన స్వీట్ ఈ చక్కెర పొంగళి రెసిపీ(Chakkara Pongal recipe).

Chakkara Pongal recipe telugu
చక్కెర పొంగళి

By

Published : Sep 24, 2021, 4:01 PM IST

ఎక్కువగా పండగల సమయంలో చేసుకునే చక్కెర పొంగళిని(Chakkara Pongal recipe).. మనకు వీలు దొరికినప్పుడు చేసుకుని ఆవురావురుమంటూ లాగించేయొచ్చు. ఇంతకీ దీనిని తయారీ ఎలా? ఏమేం పదార్థాలు కావాలో చూసేద్దామా!

కావాల్సిన పదార్థాలు

నెయ్యి, బియ్యం, పెసరపప్పు, పాలు, బెల్లం, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్​మిస్, చక్కెర, పచ్చ కర్పూరం

తయారీ విధానం

ముందుగా ఓ ప్రెషర్​ కుక్కర్​లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో బియ్యం, పెసరపప్పు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒకటికి నాలుగు వంతుల నీళ్లు పోసుకుని 5,6 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో పాలు, బెల్లం, సరిపడా నీళ్లు పోసి బాగా ఉడికిన తర్వాత ఓసారి కలుపుకొని యాలకుల పొడి వేసుకోవాలి. అనంతరం జీడిపప్పు, కిస్​మిస్​తో నెయ్యి తాలింపును చక్కెర/బెల్లం పాకంలో వేసి, చివరగా పచ్చ కర్పూరం వేసి కలుపుకొంటే ఎంతో రుచికరమైన చక్కెర పొంగళి(Chakkara Pongal recipe) రెడీ.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details