అమెరికా లాస్‌ఏంజిలెస్‌కు చెందిన ఆలానా జోన్స్ మాన్ అనే బేకర్ ఆహార ప్రియులను మరింత ఆకర్షించేలా కొత్తగా ఏమైనా చేయాలని పరితపించేది. అందులోనుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ ‘కార్పెట్ కేకు’. అనుకున్నదే తడవుగా దానిపై శ్రద్ధపెట్టి తయారుచేసేసింది. దాని తయారీ కోసం ప్రఖ్యాతిగాంచిన పర్షియన్ కార్పెట్ డిజైన్లను స్ఫూర్తిగా తీసుకుందట.
ఔరా..! అచ్చం కార్పెట్లానే ఉందే..! - ఆలానా చేసిన కార్పెట్ కేక్ తాజా వార్త
చూడగానే నోరూరించే కేకులను ఎన్నో రకాలుగా అలంకరిస్తూ ఉంటారు. కానీ ఇంకా మిగిలిపోయాయా అన్నట్టు కొత్త కొత్త డిజైన్లు పుట్టుకొస్తూనే ఉంటాయి, అటువంటిదే కార్పెట్ కేక్ కూడా.. మరి అది ఎవరు.? ఎలా తయారుచేశారో తెలుసుకుందామా!
ఔరా..! అచ్చం కార్పెట్లానే ఉందే..!
ఈ లుక్ రావడం కోసం క్రీమును చిన్నచిన్న చుక్కలుగా పేరుస్తూ రంగులు మేళవిస్తూ ఎంతో ఓపిగ్గా శ్రమించిందట! అత్యంత సునిశితమైన డిజైన్లు కావడం వల్ల వీటినిలా తయారుచేయడానికి చాలా శ్రమ పడ్డాను అంటోంది ఆలానా. అందుకే ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగానే ఆమె కష్టాన్ని గుర్తిస్తూ బోలెడన్ని లైకులూ షేర్లూ వచ్చేశాయి.
ఇదీ చూడండి:అతడు ముగ్గు వేస్తే ఫొటో తీసినట్టే!