తెలంగాణ

telangana

ETV Bharat / priya

శాకాహారిగా మారితే రూ.50 లక్షలు.! - బ్రిటన్​ కంపెనీ వినూత్న బహుమతి ప్రకటన

మీరు మాంసాహారులా.! మటన్​, చికెన్​ లేకపోతే నాలుగు వేళ్లు లోనికి పోవడం లేదా? మరీ ఓ మూడు నెలలు మాంసాహారం తినకుండా ఉండగలరా.! ఊరికేం కాదులెండీ, అలా ఉంటే మీకు పారితోషికంగా రూ.50 లక్షలు ఇస్తామంటోంది బ్రిటన్​కి చెందిన వైబ్రంట్​ వీగన్​ కంపెనీ. ప్రైజ్​మనీ వినగానే ఆసక్తి కలుగుతోందా! అయితే ఇంకెందుకు ఆలస్యం దరఖాస్తు చేసేయండి మరీ బహుమతి కొట్టేద్దాం.

britain company offers prize money for vegetarians
శాకాహారిగా మారితే రూ.50 లక్షలు.! మరీ మీరు రెడియేనా..!

By

Published : Jan 31, 2021, 12:33 PM IST

‘మీకు మాంసాహారం అంటే చాలా ఇష్టమా... మటన్‌ లేకపోతే ముద్ద దిగదా... మరి, ఓ మూడు నెలలు పూర్తిగా శాకాహారులుగా మారగలరా.. ఊరికే కాదు, అలా ఉండగలిగితే బహుమతిగా 50 లక్షల రూపాయలు అందిస్తాం’ అంటోంది బ్రిటన్‌కి చెందిన వైబ్రంట్‌ వీగన్‌ కంపెనీ. శాకాహార వంటకాలను అమ్మే ఈ సంస్థ తమ కంపెనీలో ‘వీగన్‌ క్యూరియస్‌ కోఆర్డినేటర్‌’గా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చంటూ ప్రకటన విడుదలచేసింది.

శాకాహారిగా మారితే రూ.50 లక్షలు బహుమతి ప్రకటించిన వైబ్రంట్​ వీగన్​ కంపెనీ

దీనికి ఎంపికైనవాళ్లు శాకాహారం తినడం గురించి మూడునెలలపాటు సోషల్‌ మీడియాలో ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారం చేసినందుకుగానూ రూ.50 లక్షల పారితోషికం ఇస్తారు. అయితే, ఈ ఉద్యోగానికి ఎంపికవ్వాలంటే ఓ షరతు ఉంది. అదేంటంటే... ఆ వ్యక్తి ఇప్పటివరకూ మాంసాహార ప్రియుడై ఉండాలి. ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి మూడు నెలల పాటు పూర్తిగా శాకాహారిగా మారిపోవాలి. అలా ఒప్పందం మీద సంతకం చేశాక అతడికి ఈ మూడునెలలకూ సరిపడా శాకాహారాన్ని కంపెనీయే అందిస్తుంది. ఈ సమయంలో ఓ న్యూట్రిషనిస్ట్‌ కూడా అతడి వెంట ఉంటారు. అన్నట్లూ ఈ ఒప్పందం ముగిశాక ఈ ఏడాది మొత్తం కూడా ఆ వ్యక్తి మాంసాహారం తినకుండా ఉండడానికి ఒప్పుకుంటే కోటిరూపాయల విలువైన శాకాహార ఉత్పత్తుల్ని జీవితాంతం ఉచితంగా పంపిస్తుందట వైబ్రంట్‌ వీగన్‌ కంపెనీ.

ఇదీ చూడండి :అడవుల జిల్లాకు రైల్వే భరోసా ఏది?

ABOUT THE AUTHOR

...view details