ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం. క్షణం తీరిక లేకుండా గడుపుతుండటం వల్ల ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందా? దీంతో జ్ఞాపకశక్తి మందగిస్తోందా? దేనిపైనా ఏకాగ్రత ఉండట్లేదా? మెదడుకు పదును పెట్టే పనులు తగ్గిపోయి.. ప్రతి దానికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై ఆధారపడుతున్నారా? అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పండ్లు, కూరగాయలు..
మెదడుకు పనిపెట్టే వాటిలో తాజా పండ్లు, కూరగాయలు ముఖ్యమైనవి. అందుకే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి బ్రెయిన్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్‌ను చేపల నుంచి పొందవచ్చు. పండ్లతో ఇది పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు మనలో ఆకలి వేస్తున్న భావనను పోగొట్టి కొత్త హుషారును కలిగిస్తాయి. ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్.. యాపిల్, అరటి, బొప్పాయిలో ఎక్కువగా ఉంటాయి. బాదంపప్పు, బఠానీలు, పిస్తా కంటే.. అంజీరాలో ఈ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
డ్రైఫూట్స్ అన్ని గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గించే లిపిడ్స్‌ను మెరుగుపరుస్తాయి. అదే విధంగా ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి సరిపడ శక్తి అందుతుంది. ఇందుకోసం మనం తీసుకునే అల్పాహారంలో పీచు, మాంసకృత్తులు, కొవ్వులు సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు సమంగా ఉంటాయి.
"మన ఆకలికి, మెదడుకు చాలా రిలేషన్ ఉంది. క్యాలరీలు లేనప్పుడు, పోషక ఆహారాల లోపాల వల్ల ముఖ్యంగా బీ కాంప్లెక్స్, విటమిన్స్, జింక్ లాంటి మైక్రో న్యూట్రియంట్ డెఫిషియెన్సీ వల్ల ఏక్రాగత ఉండదు. మనం తీసుకునే డైట్లో మెదడు 20శాతం క్యాలరీలను ఉపయోగిస్తుంది. కాబట్టి బ్రెయిన్‌కు గ్లూకోజ్ కావాలి. గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్‌లో దొరుకుతుంది. అయితే ఈ క్యాలరీ ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా మెదడుకు అందినప్పుడు చాలా హెల్తీగా ఉంటాం."
-డాక్టర్ మల్లీశర్వీ.