తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఆహా: సొరకాయ హల్వా.. తయారీ ఇలా - recipes with bottle gourd

హల్వాలో ఎన్నో రకాలు వచ్చేశాయి. అందులో సొరకాయ హల్వా ఒకటి. వినడానికే కొత్తగా ఉంది కదూ! మరి ఆ రుచిని మీరు ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ చూసేయండి.

bottle gourd halwa receipe, సొరకాయ హల్వా
సొరకాయ హల్వా

By

Published : Apr 12, 2021, 1:00 PM IST

స్వీట్లల్లో కొత్త రకాలను ప్రయత్నిస్తూ ఉంటాము. ఈ కోవకు చెందినదే సొరకాయ హల్వా. ఈ కొత్తరకం వంటకం రుచిని ఆస్వాదించాలంటే తయారీ కోసం ఈ కింది పదార్థాలను ఉపయోగించాలి.

కావల్సినవి : సొరకాయ తురుము- కప్పు, పాలు- రెండు కప్పులు, పంచదార- కప్పు, యాలకులపొడి- కొద్దిగా, పచ్చ రంగు ఫుడ్​కలర్​- కొద్దిగా

తయారీ విధానం

సొరకాయకి ప్రత్యేకమైన రుచి అంటూ ఉండదు. మనం అందులో ఏ పదార్థాలు కలిపితే ఆ రుచిని, పరిమళాన్ని ఆపాదించుకుంటుంది. సొరకాయ తురుముని నెయ్యిలో వేయించుకుని పంచదార, చిక్కని పాలు వేసి దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. చివరిగా యాలకుల పొడి, ఫుడ్​ కలర్​ వేసుకోవాలి. ఆఖరున కొద్దిగా కండెన్సడ్​ మిల్క్​ లేదా మిల్క్​మెయిడ్​ కలుపుకోవచ్చు. ఇష్టముంటే కోవా కూడా.

ఇదీ చదవండి :'డీప్​ ఫ్రైడ్​ వాటర్'..​ ఈ వింతను చూశారా?

ABOUT THE AUTHOR

...view details