తెలంగాణ

telangana

ETV Bharat / priya

నోరూరించే బెంగాలీ 'ఫిష్‌ పటూరి'.. ట్రై చేస్తే పోలా? - steamed fish recipe

ఏ కాలంలో తిన్నా.. శరీరానికి సరిపడ పోషకాలు అందించగలిగే శక్తి చేపలకుంది. కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తిన్నా ఇబ్బంది లేని మాంసాహారమిది. మరి, ఇన్ని లాభాలున్నా.. ఒకే స్టైల్​లో వండితే బోరే కదా.. అందుకే, ఇంట్లోనే సులభంగా చేసుకునే విధంగా... 'ఫిష్​ పటూరీ' తయారీ విధానం మీకోసం తెచ్చేశాం. ఇక ఆలస్యమెందుకు చూసేద్దాం రండి..

bengali-fish-paturi-recipe-in-telugu
నోరూరించే బెంగాలీ ఫిష్‌ పటూరి.. ఓ సారి ట్రై చేస్తే పోలా?

By

Published : Jul 3, 2020, 1:00 PM IST

చేపల ఫ్రై.. చేపల పులుసు, చేపల బిర్యానీ ఇలా చేపలతో రకరకాలుగా ప్రయత్నించి ఉంటారు. తాజా చేపలతో ఏం చేసినా అమోఘమే.. కానీ, బెంగాలీ ఫిష్ పటూరి ఎప్పుడైనా ట్రై చేశారా?

ఫిష్‌ పటూరి

కావల్సినవి

ఏదయినా ఒక రకం చేప ముక్కలు - పావుకేజీ, ఆవాలు - టేబుల్‌స్పూను (నానబెట్టుకోవాలి), కొబ్బరి ముక్కలు - రెండు చెంచాలు, పచ్చిమిర్చి - నాలుగు, పసుపు - అరచెంచా, నిమ్మరసం - అరచెంచా, చక్కెర - అరచెంచా, ఉప్పు - తగినంత, ఆవనూనె - మూడు చెంచాలు, అరటి ఆకులు - రెండుమూడు చిన్నవి (పొట్లం కట్టేందుకు వీలుగా).

తయారీ

చేప ముక్కల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. తరువాత ఆవాలూ, కొబ్బరీ, పచ్చిమిర్చీ, కొద్దిగా ఉప్పూ మిక్సీలో తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో చక్కెర, పసుపు, నిమ్మరసం వేసి కలపాలి. తరువాత మరికొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చేపముక్కలపై ఈ మిశ్రమం వేసి బాగా కలిపి అరగంటసేపు పక్కన పెట్టేయాలి. వాటిపై రెండు చెంచాల ఆవనూనె వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు అరటి ఆకుల్ని తీసుకుని వాటికి మిగిలిన ఆవనూనెను రాసి ఒక చేప ముక్కను ఉంచాలి. తరవాత అంచుల్ని మూసేసి పొట్లంలా మడిచి దారం చుట్టేయాలి. ఇలా మిగిలిన ముక్కలనూ చేసుకోవాలి. ఈ పొట్లాలను ఆవిరిమీద పదినిమిషాలసేపు ఉడికించుకుని తీసుకోవాలి. దారం తొలగించి అరటి ఆకుల నుంచి చేప ముక్కలను తీసి వేడివేడి అన్నంతో కలిపి వడ్డించాలి. అంతే ఎంతో రుచికరమైన బెంగాలీ​ ఫిష్​ పటూరీ రెడీ.

ఇదీ చదవండి: తొక్కలోనూ పోషకాలు​.. ఇలా వండుకుంటే అదిరిపోద్ది!

ABOUT THE AUTHOR

...view details