తెలంగాణ

telangana

ETV Bharat / priya

నోరూరించే 'అరటి డోనట్‌' సింపుల్ రెసిపీ! - etv bharat food

శరీరానికి పొటాషియం పుష్కలంగా అందాలంటే... అరటిని ఆహారంలో జత చేయాలి. కానీ, రోజూ అరటిపండును నేరుగా తింటే మజా ఏముంటుంది చెప్పండి..? అందుకే, ఓ సారి అరటి పండుతో డోనట్ ట్రై చేయండిలా...

banana donut sipmle recipe in telugu
నోరూరించే 'అరటి డోనట్‌' సింపుల్ రెసిపీ!

By

Published : Sep 22, 2020, 1:00 PM IST

అరటి డోనట్ ఆరోగ్యాన్ని అందించడమే కాదు.. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు కూడా.. మరింకెందుకు ఆలస్యం ఓసారి రెసిపీ చూసేయండి...

కావలసినవి

మైదా: అరకిలో, బొంబాయిరవ్వ: కప్పు, గుడ్డు: ఒకటి, పంచదార: ఒకటిన్నర కప్పులు, అరటిపండ్లు: రెండు, వెన్న: 100 గ్రా., బేకింగ్‌ సోడా: పావుటీస్పూను

తయారీ

మిక్సీలో అరటిపండ్ల గుజ్జు, పంచదార, గుడ్డు సొన వేసి రెండుమూడుసార్లు తిప్పి పక్కన ఉంచాలి.

ఓ గిన్నెలో మైదా, రవ్వ, కరిగించిన వెన్న వేసి బాగా కలపాలి. బేకింగ్‌ సోడా, అరటిపండు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ముద్దలా చేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. పిండి మాత్రం చపాతీ పిండిలా ఉండాలి. దీనిమీద మూతపెట్టి అరగంటసేపు నాననివ్వాలి. తరవాత ముద్దను మందపాటి రొట్టెలా (సుమారు అర అంగుళం మందంలో)వత్తి ఏదైనా గుండ్రని మూత లేదా కట్టర్‌తో గుండ్రని ఆకారంలో కోయాలి. తరవాత మరో చిన్న మూతతో మధ్యలో ఖాళీ వచ్చేలా డోనట్‌ ఆకారంలో కోసి నూనెలో వేయించి తీయాలి.

ఇదీ చదవండి:కూరగాయల రాజా 'వంకాయతో పిజా'!

ABOUT THE AUTHOR

...view details