తెలంగాణ

telangana

ETV Bharat / priya

నోరూరించే 'వెదురు బొంగు' కూర.. చేసేయండిలా! - హైదరాబాద్​ స్ట్రీట్ ఫుడ్స్

వెదురు బొంగు కూర గురించి ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ లేకపోతే ఈ స్టోరీ చదివేయండి. టేస్టీగా ఉండే ఈ వంటకాన్ని మీరూ ఒకసారి ట్రై చేయండి.

bamboo shoot curry
వెదురు బొంగు కూర

By

Published : Aug 22, 2021, 5:31 PM IST

ఎప్పుడూ ఒకే తరహా కూరలు చేసి చేసి బోర్ కొట్టిందా! కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ ప్రయత్నించి చూడండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో శెభాష్​ అనిపించుకోండి. ఈశాన్య భారత్​లో ఎక్కువగా తయారు చేసే వంటకం గురించి ఈరోజే తెలుసుకోండి. వెంటనే చేసేసుకోండి.

కావాల్సిన పదార్థాలు

వెదురు బొంగులు, వెల్లుల్లి, పుట్టగొడుగులు, ఆలివ్ నూనె, ఉల్లికాడలు, రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు

తయారీ విధానం

ముందుగా స్టవ్​పై పాన్ పెట్టి అందులో ఆలివ్ నూనె పోసి వేడిచేయాలి. అది వేగాక అందులో వెల్లుల్లి, ఉల్లికాడలు తరుగు వేయాలి. అందులో వెదురు బొంగుల ముక్కలు, పుట్టగొడుగు ముక్కలు వేసి బాగా కలపాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత అన్ని రకాల క్యాప్సికం ముక్కలు వేసి సన్నని మంటపై బాగా వేగనివ్వాలి. కొంచెంసేపు తర్వాత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కాస్త నీరు పోసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. స్టవ్ కట్టేసి దానిని ఓ ప్లేట్​లోకి తీసుకుంటే సరి.​ అంతే ఎంతో ఘుమఘుమలాడే 'వెదురు బొంగు కూర' రెడీ.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details