తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఇలా చేస్తే అటుకుల పాయసం అద్భుతః!

అటుకుల పాయసం.. తరచూ ఇంట్లో చేస్తుంటారు. అయితే జీడిపప్పు, పచ్చికొబ్బరి యాడ్​ చేసి.. మరింత టేస్టీగా ఎలా చేయాలో చూడండి.

Atukula Payasam
అటుకుల పాయసం

By

Published : Aug 31, 2021, 4:01 PM IST

ఏదైనా స్పెషల్ అకేషన్​​ లేదా వేడుక సమయాల్లో పాయసం చేస్తుంటారు. బియ్యం, సగ్గు బియ్యం, సేమ్యాలతో ప్రధానంగా ఈ పాయసం తయారు చేస్తారు. అయితే అనేక రకాల వంటకాలు చేసే అటుకులతో కూడా అదిరిపోయే పాయసం చేయవచ్చు. మరి ఆ టేస్టీ పాయసం ఎలా చేయాలో మీరే చదివేయండి.

కావాల్సినవి..

అటుకులు, పాలు, నెయ్యి జీడిపప్పు, పచ్చికొబ్బరి, యాలకులు, చక్కెర

తయారీ విధానం

ముందుగా ఒక మిక్సీజార్​లో జీడిపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి ఫస్ట్​ ఫౌడర్​ చేసుకుని.. తర్వాత కొంచెం నీళ్లు పోసి పేస్ట్​ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్​లో నెయ్యి వేసి వేడెక్కాక అందులో ఒక కప్పు అటుకులు వేసి మంచి కలర్​ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులో అర లీటర్​ పాలు పోసి కొంచెం నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత జీడిపప్పు, పచ్చికొబ్బరి పేస్ట్​ వేసి ఉడికిన తర్వాత యాలకుల పొడి, ఒక కప్పు చక్కెర వేసి ఉడికించుకుంటే అటుకుల పాయసం రెడీ అవుతుంది.

ఇదీ చూడండి:రెస్టారెంట్​ స్టైల్​లో 'పెప్పర్​ చికెన్​ ఫ్రై'.. ట్రై చేయండిలా!

ABOUT THE AUTHOR

...view details