అరటికాయ , క్యారెట్ రెండింటిలోనూ నిండుగా పోషకాలుంటాయి. కానీ, వాటిని నేరుగా తినడానికి పిల్లలు అట్టే ఇష్టపడరు...అందుకే, ఈ సారి ఇలా అరటికాయ క్యారెట్ గారెలు చేసి పెట్టండి.
'అరటికాయ క్యారెట్ గారెలు' సింపుల్ రెసిపీ! కావాల్సినవి
- తొక్కతో కలిపి ఉడికించిన కూర అరటికాయ - ఒకటి,
- బియ్యప్పిండి - కప్పు,
- క్యారెట్ తురుము - కప్పు,
- ఉల్లిపాయ - ఒకటి,
- వెల్లుల్లి రెబ్బలు - పది,
- పచ్చిమిర్చి - ఐదు,
- కొత్తిమీర తురుము: అరకప్పు,
- ఉప్పు - తగినంత,
- జీలకర్ర - చెంచా,
- నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం
- ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును మిక్సీలో వేసి పేస్టు సిద్ధం చేసుకోవాలి.
- తర్వాత ఓ గిన్నెలో ఉడికించిన అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో క్యారెట్ తురుము, తగినంత బియ్యప్పిండి వేసుకుని కలుపుకోవాలి.
- ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్టుతో పాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని గారెల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీస్తే రుచికరమైన అరటికాయ క్యారెట్ గారెలు సిద్ధం.
ఇదీ చదవండి: 'క్యారెట్ కేక్' తింటే 'క్యా బాత్ హై' అనాల్సిందే!