తెలంగాణ

telangana

ETV Bharat / priya

యాపిల్​తో రోటీ.. వావ్ సూపర్​ టేస్టీ - యాపిల్ పరోటా తయారీ

చిన్నపిల్లలు చాక్లెట్లు ఇష్టంగా తింటారు. కానీ పండ్లు, గుడ్లు తినేందుకు తక్కువ ఆసక్తి చూపిస్తారు! వారి ఎదుగుదలకు కారణమై, రోగనిరోధక శక్తిని పెంచేందుకు పండ్లు, గుడ్లు ఎంతో ఉపయోగపడతాయి. మరి ఈ రెండింటిని కలగలిపి చేసిన యాపిల్ రోటీని పిల్లలు టేస్ట్​ చేస్తే.. మళ్లీ మళ్లీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఆపిల్ రోటీ.. మరి దీని ఎలా చేయాలో తెలుసుకుందామా?

Apple roti
యాపిల్​తో రోటీ

By

Published : Aug 11, 2021, 6:27 PM IST

యాపిల్​లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అలాగే గుడ్డులోనూ విటమిన్లు, మాంసకృత్తులు ఎక్కువే. మరి ఈ రెండింటిని కలిపి చిన్నపిల్లలు ఇష్టంగా తినే ఆపిల్ స్నాక్​ను ఎప్పుడైనా చేశారా? ఇలాంటి స్నాక్​ను పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఈ రెసిపీ తయారీ విధానం తెలుసుకుందామా?

కావాల్సిన పదార్థాలు

  • యాపిల్
  • గోధుమపిండి
  • కోడిగుడ్డు
  • పంచదార
  • జీడిపప్పు
  • నూనె

తయారీ విధానం..

ముందుగా మిక్సింగ్​ బౌల్​లో గోధుమపిండి, కోడిగుడ్డు సొన, చెక్కుతీసిన యాపిల్ ముక్కలు వేసుకోవాలి. అందులో దంచిన జీడిపప్పు, పంచదార వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని రొట్టె లాగా వేసుకుని నూనెతో రెండు వైపులా వేయించుకోవాలి.

అలా వేయించిన రొట్టెలను ఒక​ ప్లేట్​లోకి తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా చేసి పిల్లలకు తినిపించాలి.

ఇదీ చదవండి:శ్రావణం స్పెషల్: ఈ వెరైటీలు ట్రై చేయండి!

ABOUT THE AUTHOR

...view details