మామిడి కాయలతో తయారు చేసే 'ఆమ్ కా పన్నా'.. మీ దాహాన్ని తీర్చి.. శరీరంలోని గ్యాస్ట్రో ఇన్స్టైనల్ సమస్యలను దూరం చేస్తుంది. మీ శరీరంలో సోడియం క్లోరైడ్ (ఉప్పు), ఐరన్ శాతాన్ని పెంచుతుంది. ఆమ్ కా పన్నాను తరచుగా తీసుకోవడం వల్ల.. క్షయ, రక్తహీనత, కలరా, విరేచనాలు వంటి వ్యాధులూ అదుపులోకి వస్తాయి. వడదెబ్బకు ఇది చక్కటి ఔషదం. మరి ఇన్ని లాభాలున్న ఆమ్ కా పన్నాను ఇంట్లోనే సులువుగా చేసుకోండి.
కావలసిన పదార్థాలు..
పచ్చి మామిడి కాయలు- రెండు , బెల్లం లేదా చక్కెర-రుచికి సరిపడా, యాలకుల పొడి-చిటికెడు, మిరియాలు- చిటికెడు.