తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Vishwakarma Scheme 2023 : 'విశ్వకర్మ' స్కీమ్​.. వారికి రూ.2లక్షల లోన్​.. రోజుకు రూ.500తో శిక్షణ.. అర్హులెవరంటే? - విశ్వకర్మ పథకం కేంద్రం రూల్స్​

Vishwakarma Scheme 2023 : 'విశ్వకర్మ' పథకం ద్వారా దేశంలో ఉన్న హస్త కళాకారులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ స్కీమ్​ ద్వారా వారికి రూ.2లక్షలను లోన్​ రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. అయితే ఈ పథకానికి అర్హులెవరు? రూల్స్​ ఏంటి? ఏఏ డాక్యుమెంట్లు అవసరం? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vishwakarma Yojana 2023
Vishwakarma Yojana 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 12:31 PM IST

Vishwakarma Scheme 2023 : దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక, సామాజిక భద్రత కోసం కేంద్ర సర్కార్ మరో పథకాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విశ్వకర్మ యోజన.. సెప్టెంబర్ 17న ప్రారంభం కానుంది. విశ్వకర్మ జయంతి సందర్భంగా కేంద్ర సర్కార్ ఈ కొత్త స్కీమ్ తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదే రోజున ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు కావడం గమనార్హం.

30 లక్షల కుటుంబాలకు లబ్ధి..
Vishwakarma Scheme Online Apply : విశ్వకర్మ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ హస్త కళలను ప్రోత్సహించేందుకు ఆర్థిక మద్దతు అందించనుంది. సరళమైన నిబంధనలతో అర్హత కలిగిన హస్త కళాకారులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనుంది. విశ్వకర్మ పథకం ద్వారా దాదాపు 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రం తెలిపింది.

రూ.2 లక్షల వరకు లోన్​
Vishwakarma Scheme Benefits : సర్టిఫికెట్‌, ఐడీ కార్డుల ఆధారంగా విశ్వకర్మ పథకానికి ఆయా వర్గాల నుంచి అర్హులను గుర్తిస్తారు. తొలి విడతలో రుణ సాయంగా 5శాతం రాయితీ వడ్డీతో రూ.లక్ష మంజూరు చేస్తారు. ఆ తర్వాత రెండో విడతలో రూ.2లక్షల రుణం ఇస్తారు. కళాకారులు తమ నైపుణ్యాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవడం, టూల్‌కిట్ ఇన్సెంటివ్‌, డిజిటల్‌ లావాదేవీలు, మార్కెటింగ్‌ను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ రుణాలు మంజూరు చేస్తారు.

నెలకు రూ.500తో శిక్షణ..
Vishwakarma Yojana Pradhanmantri : విశ్వకర్మ యోజన ద్వారా రెండు రకాల స్కిల్లింగ్ కార్యక్రమాలు ఉంటాయి. బేసిక్, అడ్వాన్స్డ్ అనేవి ఉంటాయి. వీటిల్లో శిక్షణ పొందుతున్నప్పుడు లబ్ధిదారులకు రోజుకు రూ.500 స్టైఫండ్​ కూడా అందిస్తుంది కేంద్రం. అలాగే అధునాతన టూల్స్ కొనుగోలు చేసుకునేందుకు కూడా ఆర్థిక సాయం అందిస్తుంది.

అవసరమైన పత్రాలివే!
Vishwakarma Scheme Documents :ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, చిరునామా పత్రం, మొబైల్ నంబర్, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పాస్​బుక్​, పాస్​పోర్ట్​ సైజు ఫొటో అవసరం అవుతాయి.

రుణాలకు అర్హులు వీళ్లే..
Vishwakarma Scheme Eligibility :ఈ విశ్వకర్మ యోజన ద్వారా లోన్ తీసుకునేందుకు వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, కమ్మరి, ఇనుప పరికరాలు తయారు చేసేవారు, ఇంటి తాళాలు తయారీదారులు, స్వర్ణకారులు, కుమ్మరి (కుండలు తయారుచేసేవారు), విగ్రహాల తయారీదారులు (మూర్తికార్‌, స్టోన్‌ కర్వర్‌, స్టోన్‌ బ్రేకర్‌), చర్మకారులు (చెప్పులు తయారుచేసేవారు), తాపీమేస్త్రీలు, బాస్కెట్‌/మ్యాట్‌/బ్రూమ్‌ మేకర్‌/నారతాళ్లు చేసేవారు, సంప్రదాయ బొమ్మలు తయారుచేసేవారు, క్షురకులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీలు, చేప వలల తయారీదారులను అర్హులుగా కేంద్రం నిర్ణయించింది.

హస్త కళాకారులకు విశ్వకర్మ పథకం

వర్చువల్​గా ప్రారంభించనున్న మోదీ..
Vishwakarma Scheme Launch : ఇటీవలే కేంద్ర కేబినెట్ సైతం ఆమోద ముద్ర వేసిన ఈ పథకం కోసం కేంద్రం రూ. 15 వేల కోట్లు కేటాయించింది. సంప్రదాయ హస్త కళా నైపుణ్యాలను ప్రోత్సహించాలని కేంద్ర సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసమే ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. విశ్వకర్మ జయంతి రోజున ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ స్కీమ్ ప్రారంభిస్తారు. ఇందులో 70 మంది మంత్రులు, 70 ప్రాంతాల నుంచి పాల్గొనబోతున్నారు.

హస్త కళాకారులకు విశ్వకర్మ పథకం

ABOUT THE AUTHOR

...view details