కాలుష్య ఉద్గారాల కట్టడికి సంబంధించిన నూతన ప్రమాణాలను అందుకునేందుకు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలకు (టీపీపీలు) కేంద్ర పర్యావరణ శాఖ కొత్త గడువును నిర్దేశించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం..
- జాతీయ రాజధాని ప్రాంతానికి (ఎన్‌సీఆర్) 10 కి.మీ.ల పరిధిలో, 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో టీపీపీలు 2022 సంవత్సరం ఆఖరు నాటికి లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది.
- ఐదేళ్ల కాలంలో జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైన 'నాన్-ఎటైన్‌మెంట్' నగరాలు, తీవ్రంగా కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాలకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న టీపీపీలకు ఈ గడువు 2023 డిసెంబరు 31గా ఉంటుంది. దేశంలో నాన్ ఎటైన్‌మెంట్ నగరాలు 124 ఉన్నాయి.
- మిగతా ప్రాంతాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు 2024 డిసెంబరు 31 నాటికి కొత్త ప్రమాణాలను అందుకోవాలి.
2025 డిసెంబరు 31లోగా మూసేసే కర్మాగారాలు ఈ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం లేదు. అయితే కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ నుంచి ఈ మేరకు మినహాయింపు పొందాల్సి ఉంటుంది. - కాగా ప్రాంతాలవారీగా టీపీపీలను 3 కేటగిరీలుగా వర్గీకరించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) ఓ కార్యదళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది.
గడువు పెంపు ఇందుకే..