తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భారత సైన్యంపై పాక్​ కన్ను- చోరీ అయిన డేటా ఎంత?

జమ్ము కశ్మీర్ ఉధంపుర్​లోని ఆర్మీ నార్తర్న్ కమాండ్​ నుంచి ఓ జవాను డేటాను తస్కరించాడు. దీన్ని పాకిస్థాన్​కు చెందిన ఐఎస్ఐ ప్రతినిధులకు అందజేశాడు. దీనిపై లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సమాచారం భారీ స్థాయిలో చోరీ కాకపోవచ్చని ఓ అధికారి పేర్కొన్నారు.

Major info likely stolen from Udhampur by soldier spy
ఉధంపుర్

By

Published : Feb 27, 2021, 4:39 PM IST

Updated : Feb 27, 2021, 5:32 PM IST

సైనిక కమాండ్​ నుంచి కీలక సమాచారం చోరీకి గురికావడం కలకలం రేపుతోంది. జమ్ముకశ్మీర్ ఉధంపుర్​లోని ఆర్మీ నార్తర్న్ కమాండ్​లో డేటా చౌర్యం వెలుగులోకి వచ్చింది. మిలిటరీ డేటాబేస్​లోకి చొరబడిన గూఢచారులు భారీగా సమాచారాన్ని తస్కరించినట్లు తెలుస్తోంది.

'లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారంటే.. ఈ అంశం ఎంత తీవ్రమైందనే విషయాన్ని సూచిస్తోందని' సంబంధిత వర్గాలు ఈటీవీ భారత్​తో చెప్పాయి.

పంజాబ్​కు చెందిన ఓ జవానును ఈ ఘటనకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ ఇంటర్​ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కొద్దిరోజుల క్రితం ఈ జవానును నియమించుకుందని పేర్కొన్నారు. నిందితుడిని సైన్యం అదుపులోకి తీసుకుంది. పెన్​డ్రైవ్​ ద్వారా సమాచారాన్ని సేకరించి పాకిస్థాన్​కు చెందిన వ్యక్తులకు అప్పగించాడని తెలుస్తోంది.

దీనిపై భారత ఆర్మీ ప్రతినిధులను వివరణ కోరగా.. భద్రతా ఉల్లంఘన జరిగిందని వారు స్పష్టం చేశారు. అయితే అధిక సమాచారం చోరీకి గురైందని చెప్పలేమని అన్నారు. అయితే దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

'భారీగా కాకపోవచ్చు'

అయితే సమాచార చౌర్యంపై మరో అధికారి అనుమానం వ్యక్తం చేశారు. భారీగా డేటా చోరీ కాకపోవచ్చని అన్నారు.

"ఈ కాలంలో సమాచారాన్ని పటిష్ఠంగా భద్రపరుస్తున్నాం. సమాచారం భద్రపరిచే శాఖ ఎంత సున్నితంగా ఉంటే.. మార్గదర్శకాలు అంత రహస్యంగా ఉంటాయి. ఓ జవాను కీలక పత్రాలను చోరీ చేశాడని అంటే అది ప్రశ్నార్థకమే."

-సైనిక అధికారి

16వ కార్ప్స్​ ప్రధాన కార్యాలయం నెలకొన్న జమ్ములోని నగ్రోటా ప్రాంతంలో ఈ జవాను విధులు నిర్వర్తించేవాడు. జమ్ము కశ్మీర్​లోని పీర్​పంజల్ ప్రాంతంలోని సైనిక వ్యవహారాలను 16వ కార్ప్స్​ పర్యవేక్షిస్తుంది. ఉత్తర భారతదేశంలోని సైన్యం వ్యవహారాలు, ప్రణాళికలకు ఉధంపుర్ బేస్ కేంద్ర బిందువు లాంటిది. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వద్ద కార్యకలాపాలనూ ఉధంపుర్​లో పర్యవేక్షిస్తున్నారు.

(సంజీవ్ బారువా-సీనియర్ పాత్రికేయులు)

ఇదీ చదవండి:చేతిలో పేలిన ఐఈడీ.. నక్సలైట్ మృతి

Last Updated : Feb 27, 2021, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details