తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆర్మేనియాకు పినాక.. ఫిలిప్పీన్స్​కు బ్రహ్మోస్​.. ప్రపంచ ఆయుధ సరఫరాదారుగా భారత్! - అమెరికా

భారత్ దేశీయంగా​ తయారుచేసిన మల్టీ బ్యారెల్ రాకెట్​ లాంఛర్​ పినాకను తొలిసారి అంతర్జాతీయంగా విక్రయించనుంది. అజర్​బైజాన్​ చేతిలో భారీగా నష్టపోయిన ఆర్మేనియాకు పినాకను సరఫరా చేయనుంది. ఇప్పటికే బ్రహ్మోస్​ను ఎగుమతి చేసేందుకు సిద్ధమైన భారత్.. త్వరలోనే ప్రపంచ ఆయుధ సరఫరాదారుగా మారనుందా? నిపుణులు ఏమంటున్నారు?

Indias 2022 shastra shakeup
Indias 2022 shastra shakeup

By

Published : Dec 23, 2022, 7:55 PM IST

Look Back 2022 Indias Shastra: 40 రోజులకు పైగా సాగిన యుద్ధంలో అజర్​బైజాన్​ చేతిలో ఓడిపోయిన ఆర్మేనియాకు.. భారత్ రూ.2400 కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించనుంది. దీంతో భారత్​​ సరఫరా చేసిన ఆయుధాలపైనే ఆర్మేనియా ఆశలు పెట్టుకుంది. అయితే ప్రపంచ దేశాలకు ఆయుధాలను విక్రయించడం భారత్​కు ఇదేం మొదటిసారి కాదు. కానీ ఆర్మేనియాకు ఎగుమతి చేయడం భారతదేశ విదేశాంగ విధానానికి నిజంగా ఒక ప్రత్యేకమైన క్షణం. రెండు దేశాల మధ్య జరిగే ఘర్షణల విషయంలో భారత్.. ఏనాడూ ఒక పక్షానికి మద్దతు ప్రకటించలేదు. అయితే, మనదేశానికి ఎప్పుడూ దెబ్బతీయాలని చూసే దాయాది దేశం పాకిస్థాన్​ పక్షాన అజర్​బైజాన్​ చేరడం వల్ల భారత్‌కు అర్మేనియాతో వ్యూహాత్మక సంబంధాలు నెరపవలసిన అవసరం వచ్చిపడింది.

ఆర్మేనియాకు భారత్​ విక్రయిస్తున్న ఆయుధాల్లో ముఖ్యమైనది మల్టీ బ్యారెల్ రాకెట్​ లాంఛర్​ పినాక. డీఆర్​డీవో అభివృద్ధి చేసిన ఈ మల్టీ బ్యారెల్​ రాకెట్​ లాంఛర్​ సిస్టమ్.. కేవలం 44 సెకన్లలో 75 రాకెట్లను పేల్చడం ద్వారా వెయ్యి మీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పు గల ప్రాంతాన్ని భస్మీపటలం చేయగలదు.

ఆర్మేనియాకు ఆయుధ సరఫరా చేయనున్న భారత్​.. తన సొంత ప్రణాళికలు కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. అజర్‌బైజాన్, పాకిస్థాన్, తుర్కియేల మధ్య మైత్రి వృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్​ తన సొంత ప్రయోజనాల కోసం ఆర్మేనియాతో ఒప్పందం కుదుర్చుకుందని అంటున్నారు. ఉక్రెయిన్​తో యుద్ధంలో రష్యా తలమునకలై ఉండడం వల్లనే ఆర్మేనియాకు భారత్​ ఈ ఆయుధ వ్యవస్థలన్నింటినీ పంపనుందని అభిప్రాయపడుతున్నారు.

భారత్​ అతిపెద్ద ఆయుధసరఫరాదారుగా..
రష్యా అభ్యర్థన మేరకే ఆర్మేనియాకు భారత్ ఆయుధాలు సరఫరా చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో భారత్​ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా మారనుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2022లో వివిధ దేశాలకు రూ.13 వేల కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించాలని భారత్​ భావిస్తోంది. ఆయుధ ఎగుమతుల ద్వారా వచ్చే రెండేళ్లలో రూ.35 వేల కోట్లను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జనవరిలో బ్రహ్మోస్​ క్షిపణిని విక్రయించేందుకు ఫిలిప్పీన్స్​తో భారత్​ ఒప్పందం చేసుకుంది​. కొత్త ఆర్డర్ల కోసం మలేసియా, వియత్నాం, ఇండోనేసియాతో సంప్రదింపులు జరుపుతోంది. దీని ద్వారా 2025 నాటికి బ్రహ్మోస్​ ఏరోస్పేస్​ కంపెనీ 5 బిలియన్ల డాలర్లు ఆర్జించాలని భావిస్తోంది. ప్రస్తుతం భారత్.. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలకు స్వదేశీ సైనిక పరికరాలను విక్రయిస్తోంది.

సశస్త్ర భారత్​

అంబానీ, అదానీలకే కాకుండా..
ఆయుధాల ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నపాటి పరిశ్రమ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబానీ, అదానీ, టాటా గ్రూప్​ వంటి పెద్దపెద్ద సంస్థలకు మాత్రమే కాకుండా చిన్నపాటి పరిశ్రమలను కూడా కేంద్రం అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

రష్యా నుంచి భారత్​ దూరం.. సాధ్యమేనా?
ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. అందులో ఎక్కువగా రష్యా నుంచే భారత్​ దిగుమతి చేసుకుంటోంది. రష్యాకు చెందిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోళ్ల విషయంలో భారత్​పై కాట్సా చట్టం కింద చర్యలు తీసుకుంటామని అమెరికా బెదిరించింది. ఆ తర్వాత నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. రష్యా నుంచి భారత్​ను వేరుచేయడానికి అమెరికా పలు విధాలుగా ప్రయత్నిస్తోంది.

కానీ, రష్యాపై భారత్​ ఆధారపడాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భారత్​లో ఉన్న యుద్ధ విమానాల్లో 61 శాతం రష్యానే సరఫరా చేసింది. అంతే కాకుండా లైసెన్సు ప్రాతిపదికన ఏకే-203 ఆయుధాలు​, టీ-90, టీ-72 ట్యాంకులను భారత్​ దేశీయంగా తయారు చేస్తోంది. వాటి విడిభాగాల కోసం భారత్​.. రష్యాపైనే ఆధారపడింది. ఈ నేపథ్యంలో అమెరికాతో సహ పలు దేశాలు కోరుకుంటున్నట్లుగా రష్యా నుంచి భారత్​ దూరం కావడం సాధ్యం కాదని చెబుతున్నారు.

-- సంజయ్ కపూర్​

ABOUT THE AUTHOR

...view details