తెలంగాణ

telangana

ETV Bharat / opinion

జేడీఎస్​కు బీఆర్​ఎస్ అండ.. కేసీఆర్​పైనే భారీ ఆశలు.. ప్రభావం ఎంతంటే? - Telangana Cm kcr jds kumaraswamy latest

కర్ణాటకలో ఎన్నికల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మరోవైపు పార్టీలు వ్యూహాలను పదునుపెడుతున్నాయి. అయితే కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​. దీంతో తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని తెలుగు ఓటర్లు ఎంత మేర జేడీఎస్​ వైపు ఎంత మేర మొగ్గు చూపుతారో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Telangana Cm kcr support to kumaraswamy jds
జేడీఎస్​కు మద్దతు పలికిని సీఎం కేసీఆర్​

By

Published : Apr 18, 2023, 3:28 PM IST

మరికొద్ది రోజుల్లో కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్​ నువ్వా-నేనా అన్న రీతిలో ప్రచారాన్ని రీతిలో హోరిత్తిస్తున్నాయి. ఈ సారి విజయాన్ని అందుకునేందుకు జేడీఎస్ పార్టీ కూడా తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం జరిగింది. జేడీఎస్​ పార్టీకి మద్దతు పలికింది భారత్​ రాష్ట్ర సమితి(బీఆర్​ఎస్​). కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో నివసించే తెలుగు ఓటర్లను జేడీఎస్ వైపు మళ్లించేందుకు భారాస ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతేడాది టీఆర్‌ఎస్.. బీఆర్​ఎస్​(భారత్​ రాష్ట్ర సమితి)గా మారి జాతీయ పార్టీగా ఆవిర్భవించిన సమయంలో సీఎం కేసీఆర్​కి మద్దతు తెలిపింది జేడీఎస్​. అప్పట్లో జేడీఎస్​ తమ మిత్రపక్షమని.. పొత్తులపై భవిష్యత్​లో చర్చిస్తామని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​. ఈ క్రమంలో దేశ రాజకీయలతో పాటు కర్ణాటక రాజకీయాలపై కూడా చర్చించేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి హైదరాబాద్​ వచ్చి పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్​తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో జేడీఎస్​కు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ప్రకటించారు.

జాతీయ రాజకీయాల్లో రాణించాలని ఉవ్విళ్లూరుతున్న బీఆర్‌ఎస్​ను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని కోరారు కుమారస్వామి. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని జిల్లాల్లో బీఆర్​ఎస్ తమ అభ్యర్థులను బరిలోకి దింపనుందని అప్పట్లో ప్రచారం జరిగినా.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది బీఆర్​ఎస్​ పార్టీ. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్​.. జేడీఎస్​కు మద్దతు తెలపడం వల్ల ఈ ప్రచారానికి బ్రేక్​ పడింది.

కర్ణాటక-తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో జేడీఎస్ తరఫున సీఎం కేసీఆర్​​ ప్రచారం చేయనున్నారు. బీఆర్​ఎస్​ పార్టీ విస్తరణ వ్యూహంలో భాగంగా తెలంగాణ సరిహద్దులోని కళ్యాణ కర్ణాటకలోని కొన్ని జిల్లాలపై గులాబీ పార్టీకి కొంత పట్టున్న నేపథ్యంలో జేడీఎస్​-బీఆర్​ఎస్​ల దోస్తీ ఏ మేరకు ఫలితాలనిస్తుందో మే 13న తేలిపోనుంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్​సభ ఎన్నికలకు కేసీఆర్​ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే జేడీఎస్​తో మంచి సంబంధాలు కొనసాగిస్తోంది.

కొత్త పథకాలతో ప్రజలు ముందుకు..
ఇప్పటికే తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్​ వంటి పథకాలను అమలు చేస్తామంటూ కర్ణాటకలో ప్రచారం చేస్తోంది జేడీఎస్​. 2018లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక-తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో దక్షిణ బీదర్​, గుర్మత్​కల్​, మాన్వి, సింధనూర్​ సహా నాలుగు నియోజకవర్గాల్లో కుమారస్వామి పార్టీ విజయం సాధించింది. వీటితో పాటు బీఆర్ఎస్​​ మద్దతుతో మరిన్ని నియోజకవర్గాల్లో కూడా గెలవాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది.

కర్ణాటకలోని బీదర్, బళ్లారి, రాయచూర్, కొప్పల్, గంగావతి, యాదగిరి, కలబురగి, చిక్కబళ్లాపూర్, బాగేపల్లి, గౌరిబిదనూరు, కోలార్, చింతామణి జిల్లాలు తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ జిల్లాల్లోని 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 స్థానాల్లో తెలుగు మాట్లాడేవారి సంఖ్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో కేసీఆర్​తో ప్రచారం చేయిస్తే ​లాభపడొచ్చనేది జేడీఎస్ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

జేడీఎస్​ తరఫున దీదీ ప్రచారం..
మరోవైపు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా జేడీఎస్​ తరఫున ప్రచారం చేయనున్నారు. కొద్ది రోజుల క్రితం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి.. మమతా బెనర్జీని కోల్​కతాలో కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి రావాలని మమతను కుమారస్వామి ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details