తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Engineer's day: నవకల్పనలతోనే సరికొత్త జవజీవాలు.. - ఇంజినీరింగ్‌ డే ఎందుకు జరుపుకుంటారు?

అధ్యాపకుల చుట్టూ ఇంజినీరింగ్‌ విద్య(Engineer's day) కేంద్రీకృతమవడం నుంచి విద్యార్థికి ప్రాధాన్యమిచ్చేదిగా మారిపోతోంది. పాఠాలు బట్టీ ఫలితాల సాధనకే  ప్రాధాన్యం లభిస్తోంది. చాక్‌పీసు, నల్లబల్ల స్థానాన్ని ఆన్‌లైన్‌ బోధన, అభ్యసనాలు ఆక్రమిస్తున్నాయి. ఈ మార్పులను దేశీయ సాంకేతిక రంగంలో ఉద్యోగాలు సాధించి, రాణించే సత్తా 80శాతం భారతీయ ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో కనిపించడం లేదని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. నేడు జాతీయ ఇంజినీర్ల దినోత్సవం(Engineer's day 2021) సందర్భంగా ప్రత్యేక కథనం..

ఇంజనీరింగ్
ఇంజనీరింగ్

By

Published : Sep 15, 2021, 7:25 AM IST

దేశాభివృద్ధిలో ఇంజినీర్ల (Engineer's day) కీలక పాత్రను గుర్తించి గౌరవించడానికి 1968 నుంచి ఏటా సెప్టెంబరు 15న ('భారతరత్న' మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం (Mokshagundam Visvesvaraya)) జాతీయ ఇంజినీర్ల దినోత్సవంగా(Engineer's day 2021) జరుపుకొంటున్నాం. ఈనాటి విజ్ఞానాధారిత, సాంకేతిక చోదిత ప్రపంచంలో నెగ్గుకురావాలంటే నవకల్పనలు ఆవశ్యకం. ఇంజినీరింగ్‌ విద్య దేశానికి అటువంటి సృజనశీలురను అందించగలగాలి. ప్రపంచమంతటిలోకీ అత్యధిక ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలు భారతదేశంలోనే ఉన్నాయి. విశ్వవ్యాప్తంగా ఇంజినీర్లలో 25శాతం భారత్‌లోనే ఉన్నా, ఇక్కడి విద్యాప్రమాణాలు అంతర్జాతీయ స్థాయితో తులతూగలేకపోతున్నాయి. ప్రపంచమంతటా ఇంజినీరింగ్‌ విద్య అధ్యాపకుల చుట్టూ కేంద్రీకృతమవడం నుంచి విద్యార్థికి ప్రాధాన్యమిచ్చేదిగా మారిపోతోంది. పాఠాలు బట్టీపట్టడానికి కాకుండా ఫలితాల సాధనకే ప్రాధాన్యం లభిస్తోంది. చాక్‌పీసు, నల్లబల్ల స్థానాన్ని ఆన్‌లైన్‌ బోధన, అభ్యసనాలు ఆక్రమిస్తున్నాయి. ఈ మార్పులను దేశీయ ఇంజినీరింగ్‌ విద్య (Engineer's day) ఇంకా పూర్తిగా అందిపుచ్చుకోలేదు.

ఉద్యోగార్హతలో వెనకబాటు..

సాంకేతిక రంగంలో ఉద్యోగాలు సాధించి, రాణించే సత్తా 80శాతం భారతీయ ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో (Engineering students) కనిపించడం లేదని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ నిర్వహించే జాతీయ సంస్థాగత ర్యాంకింగ్‌ విధానం(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో 50శాతానికి మించి మార్కులు సాధించిన ఇంజినీరింగ్‌ కళాశాలలు రెండు శాతంకన్నా తక్కువని 2019లో వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్‌ సర్వే నిగ్గుతేల్చింది. ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో అయిదు శాతంకన్నా తక్కువ మంది మాత్రమే గేట్‌ పరీక్షలో ఉత్తీర్ణులవుతున్నారు. పరిశ్రమ అవసరాలను తీర్చేలా ఇంజినీరింగ్‌ (Engineer's day) పాఠ్యప్రణాళికలు రూపుదిద్దుకోవడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు కోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తగిన చర్యలు తీసుకొంటోంది. కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులపై 2022 వరకు మారటోరియం విధించింది. సరికొత్త కోర్సులను ప్రారంభించే కళాశాలలకు మాత్రం అనుమతులిస్తోంది. 2021-22లో వెనకబడిన జిల్లాల్లో 54 కొత్త కళాశాలలకు అనుమతి ఇవ్వనుంది. ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉండే వృత్తివిద్యా కోర్సుల్లో బీటెక్‌ డిగ్రీలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది. మరోవైపు దేశంలో ఏటా పట్టభద్రులవుతున్న 10 లక్షల పైచిలుకు ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో కేవలం అయిదు శాతమే ఐఐటీలు, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి ఉత్తీర్ణులవుతున్నారు. ఈ సంస్థల విద్యార్థులకు ఉన్నంత ఉన్నత ప్రమాణాలు సాధారణ ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థుల్లో వృద్ధి చెందడం లేదు.

ఇంటర్న్​షిప్​లతో మేలు..

ఇంజినీరింగ్‌ రంగంలో (Engineer's day) ఉపాధి అవకాశాలు ఎక్కువగానే ఉన్నా- వాటిని అందిపుచ్చుకొనేలా విద్యార్థులను తయారుచేయగల సమర్థ అధ్యాపకులకు తీవ్ర కొరత ఉంది. ఇంటర్నెట్‌ వంటి సౌకర్యాలు, సాంకేతిక గ్రంథాలయాలు, ఉత్తమ మూల్యాంకన పద్ధతులు అత్యధిక కళాశాలల్లో లోపించాయి. ఈ లొసుగులను తక్షణం సరిదిద్దాలి. ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రవేశించిన వెంటనే విద్యార్థికి సాంకేతిక నైపుణ్యాలు, మౌలికాంశాలపై అవగాహనను పెంపొందించాలి. ఎప్పటికప్పుడు మారిపోయే పరిశ్రమ అవసరాలను తీర్చేలా పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయాలి. డిగ్రీ కోర్సులు పూర్తయ్యే లోపు ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా పరిశ్రమల్లో నాలుగు నుంచి ఎనిమిది వారాలపాటు ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం ఉండాలి. ఇలాంటివి మూడు విడతలుగా కల్పించాలి. సాఫ్ట్‌ స్కిల్స్‌ను విధిగా నేర్పాలి. ప్రతి దశలో విద్యార్థిలో నవకల్పనలు, సృజనాత్మక శక్తిని పెంపొందించే విధంగా బోధనాభ్యసనాలు సాగాలి. అధ్యాపకులకూ స్వయం పోర్టల్‌ ద్వారా పునశ్చరణ తరగతులు నిర్వహించాలి. కొత్త అంశాలపై పట్టు సాధించేలా ప్రోత్సహించాలి.

నవక్పనల కోసం..

పాశ్చాత్య దేశాలు, చైనా, జపాన్‌లు రోబోలతో, కృత్రిమ మేధతో హైటెక్‌ పారిశ్రామికోత్పత్తికి మారుతున్నాయి. వాటితో ఇండియా పోటీపడాలంటే తన ఇంజినీరింగ్‌ పాఠ్యప్రణాళికలను ఆధునికీకరించాలి. నూతన వస్తుసేవల రూపకల్పనలో భారతీయ విద్యార్థులను దిట్టలుగా తీర్చిదిద్దాలి. 5జి, 6జి సాంకేతికతలు అతిత్వరలో భారత్‌లో రంగప్రవేశం చేస్తాయి. ఆ కమ్యూనికేషన్‌ వ్యవస్థల నిర్వహణకు ఇంజినీరింగ్‌ విద్యార్థులను సన్నద్ధులను చేయాలి. పర్యావరణహితకర ఇంజినీరింగ్‌ సంవిధానాలను రూపొందించి ఆచరించాలి. రేపటి విద్యార్థులు ఏదో ఒక్క కోర్సులో నిష్ణాతులైతే చాలదు. వివిధ సాంకేతికాంశాలను సమన్వయపరచుకోగలగాలి. కళలు, సామాజిక శాస్త్రాలతోనూ పరిచయం ఉంటేనే కొత్త డిజైన్లతో సమాజానికి అవసరమైన వస్తుసేవలను రూపొందించగలుగుతారు. బహుముఖ పరిజ్ఞానం ఉంటేనే నవకల్పనలు సాధించగలుగుతారు. సృజనశీలురుగా ఎదగగలుగుతారు. కాబట్టి వారిని బహుముఖ ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దగల పాఠ్యప్రణాళికలను, ఆచరణ ద్వారా అనుభవం గడించే అవకాశాన్నీ ఇంజినీరింగ్‌ కళాశాలలు అందించాలి. దీనికి ప్రభుత్వం, పరిశ్రమలు ఇతోధికంగా చేయూత ఇవ్వాలి.

కేటాయింపులు పెరగాలి..

ఆటొమేషన్‌, ఎలక్ట్రిక్‌ వాహన తయారీ, ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌, ఆన్‌లైన్‌ వైద్య సేవలు, ఔషధ రంగాల్లో ప్రపంచంలోనే మేటిగా ఎదిగే సత్తా భారతదేశానికి ఉంది. ఇంకా వ్యవసాయ ఆటొమేషన్‌, డేటా ఆధారిత సేవలు, మొబైల్‌ కమ్యూనికేషన్లు, అంతరిక్ష సైన్సుల్లోనూ అగ్రగామిగా ఎదిగే సామర్థ్యమూ ఉంది. అయితే, వాటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి పరిశోధన, అభివృద్ధి ఊపందుకోవాలి. ప్రభుత్వం ఇందుకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి. 21వ శతాబ్ది పాఠ్యప్రణాళికలు, బోధన, అభ్యసనాలతో ఇంజినీరింగ్‌ కళాశాలలు ముందుకురావాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా మేలైన విద్యను అందించినప్పుడు మన యువతరం నవీకరణ సాధకులుగా, విధానకర్తలుగా, సమర్థ నిర్వాహకులుగా రాణిస్తారు. సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారు.

-రచయిత-డాక్టర్ కె.బాలాజీ, విద్యారంగ నిపుణులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details