Naveen murder Case నవీన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన లవర్‌తో నవీన్ క్లోజ్‌గా ఉంటున్నాడనే అనుమానంతో హరిహర కృష్ణ.. తన స్నేహితుడు నవీన్‌ను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా ఈ హత్య ప్లానింగ్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Harihara Krishna super planning to Naveen murder ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు హరిహరకృష్ణ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు హత్య చేసేందుకు కొన్ని రోజుల ముందే కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులకు చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. షాపింగ్ మాల్‌లో 2 నెలల క్రితం కత్తి కొనుగోలు చేసిన నిందితుడు... కొన్నాళ్లుగా స్కూటీలో కత్తి పెట్టుకుని తిరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల దర్యాప్తులో తేలిన అంశాలు చూస్తే...ఇక నవీన్‌ను హత్య చేసే సమయంలో హరిహర కృష్ణ చేతికి గ్లౌజులు వేసుకున్నాడు. ఆ తరువాతే నవీన్‌ను హతమార్చి... అనంతరం బాడీ పార్ట్ కట్ చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా దుస్తులు తొలగించాడు. దుస్తులు చూసి మృతదేహాన్ని గుర్తిస్తారనే ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు. హరిహరకృష్ణ హత్య చేసిన తీరును చూసి పోలీసులే విస్తుపోయారు.
నిందితుడి మానసికస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ఇంత క్రూరంగా చంపడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. క్రైం వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ చూసి హత్యకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. ఇక హరిహర కృష్ణ.. నవీన్‌ను ఎంత క్రూరంగా చంపాడో తెలిసిన విషయమే. నా ప్రేయసిని ప్రేమిస్తావా అంటూ.. గుండెను చీల్చి.. మర్మాంగాల్ని కట్ చేసి.. చేతివేళ్లు, పేదాలు కట్ చేసి... క్రూరంగా చంపాడు హరహరకృష్ణ. ఈ ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడిందనే చెప్పాలి.
ఇవీ చదవండి: