ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు! ప్రపంచంలో అతిపెద్ద ఇస్లామిక్ ఉగ్రవాద పోషణ కేంద్రమైన పాకిస్థాన్ విషయంలో ఈ సామెత అక్షరాలా వర్తిస్తుంది. 'మా ప్రప్రథమ లక్ష్యం పాకిస్థాన్‌ను (Isis K On Pakistan News) సర్వనాశనం చేయడమే' అని అఫ్గానిస్థాన్‌లో చెలరేగిపోతున్న ఇస్లామిక్ స్టేట్-ఖొరాసాన్ (ఐసిస్-కె) (Isis K On Pakistan News) సంస్థ సభ్యుడు నజీఫుల్లా తాజాగా ప్రకటించారు. అంతేకాదు, ఈ సంస్థ మరో ఆరు నెలల్లో అమెరికా మీదా దాడి చేసే సామర్థ్యాన్ని సంతరించుకోవచ్చని అగ్రరాజ్(America Isis News)య రక్షణ శాఖ ఉపమంత్రి కాలిన్ కాల్ గత నెలలో సెనెట్‌కు తెలిపారు. అఫ్గాన్‌లోనే తిష్ఠ వేసిన అల్‌ఖైదా (Al Qaeda Pakistan) సైతం ఒకటి రెండేళ్లలో అమెరికాపై దాడి చేసే సామర్థ్యాన్ని సంపాదించవచ్చునని హెచ్చరించారు. ఈ ఏడాది ఆగస్టులో కాబూల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడితో 13 మంది అమెరికన్ సైనికుల మరణానికి కారణమైన సంస్థ ఐసిస్-కె(Isis K News). షరియా చట్టాన్ని ప్రపంచమంతటా అమలు చేయాలని కృత నిశ్చయంతో ఉన్నామని, అందుకు అడ్డు వచ్చేవారెవరైనా సరే ఇస్లాం మతాన్ని, ఖురాన్‌ను వ్యతిరేకిస్తున్నట్లేనని, వారు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఐసిస్-కె సభ్యుడు నజీఫుల్లా హెచ్చరించారు. గతంలో తాలిబన్లు అఫ్గాన్‌లో అధికారంలో ఉన్నప్పుడు షరియా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకోనందువల్లే ఐసిస్-కెని ప్రారంభించామని ఆయన చెబుతున్నారు.
ఊవిళ్లూరుతోంది..
ప్రస్తుతం ఐసిస్-కె అఫ్గాన్, పాక్‌లకు పరిమితమైనా... మున్ముందు మధ్యాసియాలో, దక్షిణాసియాలో పూర్వ ఖలీఫా సామ్రాజ్యాన్ని పునఃప్రతిష్ఠించాలని ఊవిళ్లూరుతోంది. ప్రపంచ ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించాలనే లక్ష్యానికి తాలిబన్లు తిలోదకాలిచ్చి, పాక్ ప్రోద్బలంతో పూర్తిగా అఫ్గాన్‌కే పరిమితమవుతున్నారని ఐసిస్-కె (Isis K On Pakistan News) మండిపడుతోంది. అందుకే పాక్‌ను సర్వనాశనం చేస్తానంటోంది. అఫ్గాన్‌లో ఉన్న జిహాదీ గ్రూపులన్నింటిలోకీ అత్యంత ప్రమాదకరమైనది ఐసిస్-కె. ఇరాక్, సిరియాలలో నెలకొన్న ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) స్ఫూర్తితో 2015లో అఫ్గానిస్థాన్‌లో ఐసిస్-కె (Isis K News) ప్రారంభమైంది. పాకిస్థానీ, అఫ్గానీ తాలిబన్లు, ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్ మాజీ సభ్యులతో మొదలైన ఈ సంస్థ క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం అఫ్గానిస్థాన్ గూఢచారి సంస్థల సభ్యులు సైతం ఐసిస్-కెలో చేరిపోతున్నారు. ఇంతకుముందు అమెరికా మద్దతుతో నడిచిన అష్రఫ్ ఘనీ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంస్థల్లో పనిచేసిన ఈ గూఢచారులను నేడు తాలిబన్లు వేటాడుతున్నందువల్ల వారిలో అత్యధికులు ఆత్మరక్షణ కోసం ఐసిస్-కెలో చేరిపోతున్నారు.
అఫ్గాన్‌లో పెత్తనంకోసం తహతహ
అఫ్గానిస్థాన్‌లో అరాచకం, అల్లకల్లోలం సృష్టించడం ద్వారా తాలిబన్లను బలహీనపరచి తానే పెత్తనం చేయాలని ఐసిస్ చూస్తోంది. తదనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాల మీద, బాలికల పాఠశాలల మీద, ప్రజాస్వామ్య ప్రదర్శనల మీద, షియా ప్రార్థన స్థలాల మీద దాడులకు తెగబడుతోంది. అంతర్జాతీయ సహాయ సిబ్బందిపైన, అఫ్గాన్‌లో మైనారిటీలైన సిక్కులు, హజారాల మీద కూడా ఐసిస్-కె పంజా విసరుతోంది. పాక్ సరిహద్దులోని నంగన్ హార్, కునార్ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగించే ఐసిస్- పాక్ నుంచి ఉగ్రవాదులను చేర్చుకుంటోంది. సాధన సామగ్రిని సేకరిస్తోంది. ఇరాక్, సిరియాలలోని మాతృ సంస్థ ఐసిస్ నుంచి ఐసిస్-కె కు పది కోట్ల డాలర్ల నిధులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో అమెరికా, అష్రఫ్ ఘనీ ప్రభుత్వ దాడులతో ఐసిస్-కె నీరసించిపోయింది. తమ శ్రేణుల్లో మళ్ళీ ఉత్సాహం నింపడానికి ఆ సంస్థ అధిపతి షహాబ్ అల్ ముజాహిర్ నిరుడు ఆగస్టులో జలాలాబాద్ జైలు మీద దాడి జరిపి వందలాది ఉగ్రవాదులను విడుదల చేశారు. వారిలో తాజాగా పాక్‌కు హెచ్చరిక పంపిన నజీఫుల్లా ఒకరు!