కొవిడ్ లాక్‌డౌన్లకు వాతావరణ మార్పులు, సామాజిక-ఆర్థిక సంక్షోభాలు తోడై పలు దేశాలు ఆహార కొరతను(Food Shortage) ఎదుర్కొంటున్నాయి. కొన్ని ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాలు ఆకలి కేకలకు దారితీస్తుంటే, తనకు తానుగా ఏకాకిగా ఉన్న ఉత్తర కొరియా(Food Shortage In North Korea) తీవ్ర ఆహార సంక్షోభంలోకి జారిపోతోంది. భారత్, చైనాలతోపాటు పలు ఐరోపా దేశాలు ఆహారం విషయంలో(Food Shortage) స్వయం సమృద్ధంగా ఉన్నా, మన పొరుగునే ఉన్న శ్రీలంక మాత్రం ఆర్థిక ఆత్యయిక స్థితిని ప్రకటించాల్సి వచ్చింది. ఆ దేశ జీడీపీకి పది శాతానికిపైగా సమకూర్చే పర్యాటక రంగం కొవిడ్ వల్ల కుదేలు కావడంతో విదేశ మారక ద్రవ్య నిల్వలు దారుణంగా పడిపోయాయి. ఆహారం, మందులు, ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడే శ్రీలంక(Food Crisis In Sri Lanka) ఈ మూడు నిత్యావసరాల దిగుమతులకు డబ్బు చెల్లించలేని దుస్థితిలోకి జారిపోయింది.
మానవ వనరులకు కటకట
కొవిడ్‌కు ముందే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న శ్రీలంక(Food Crisis In Sri Lanka) కొత్త అప్పుల కోసం ఐఎంఎఫ్ వద్దకు పరుగులుతీయక తప్పలేదు. ఫలితంగా ఆ దేశ కరెన్సీ విలువ పడిపోయి ఆహార దిగుమతులకు ఇదివరకటికన్నా ఎక్కువ విదేశీ ద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. దాంతో ఇతర దేశాల నుంచి అధిక ధరలకు ఆహారం దిగుమతి చేసుకునే స్థోమత లంకకు లేకుండా పోయింది. పేద, మధ్యతరగతివారు నల్ల బజారులో అధిక ధరలకు ఆహారం కొనాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించి వర్తకులు, దిగుమతిదారుల వద్ద ఉన్న ఆహార నిల్వలను స్వాధీనం చేసుకొంటోంది. వాటిని ప్రజలకు సరసమైన ధరలకు విక్రయించే బాధ్యతనూ సైన్యానికి అప్పగించింది. ఈ క్రమంలో చిన్న దుకాణదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిజానికి ఆహార కొరత శ్రీలంక ప్రభుత్వ స్వయంకృతమే. రైతులంతా రసాయన ఎరువులను విడనాడి ఆర్గానిక్ సేద్యానికి మారాలని హుకుం జారీ చేసిన ప్రభుత్వం, ఆర్గానిక్ ఎరువులను సరిపడా సరఫరా చేయలేకపోయింది. దీంతో పంట దిగుబడులు సగానికి సగం పడిపోయి, ప్రజలు ఆహారం కోసం అల్లాడుతున్నారు.
కొవిడ్ వల్ల ఆహార కొరత..
మరోవైపు దేశంలో కొవిడ్ కేసులు విజృంభిస్తున్నా- రోగుల చికిత్సకు మందులు, వైద్య సామగ్రి లేక ఆస్పత్రులు చతికిలపడుతున్నాయి. కావాల్సినవి దిగుమతి చేసుకునే అవకాశమూ లేదు. సంపన్న అమెరికా, బ్రిటన్‌లు సైతం కొవిడ్ వల్ల ఆహార కొరతను(Food Shortage) ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో ఆహారం, పాడి ఉత్పత్తి పడిపోవడం వల్ల కొరత ఏర్పడిందా అంటే.. కానే కాదు. బ్రెగ్జిట్ వల్ల బ్రిటన్, డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల అమెరికా- పొరుగు దేశాల నుంచి వ్యవసాయ కూలీలను రప్పించుకోలేకపోతున్నాయి. పొలాల్లో పండ్లు, కూరగాయలు, ధాన్యం కోతలకు కూలీలు లేరు. పొలం నుంచి సూపర్ మార్కెట్‌కు ఆహారోత్పత్తులను రవాణా చేయడానికి డ్రైవర్లూ లేరు. ఫలితంగా పలు సూపర్ మార్కెట్ల అరలు సరకులు లేక ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. కోడిమాంసం, కూరగాయలు, చీజ్ సరఫరాలు పడిపోవడంతో రెస్టారెంట్లు తమ వంటకాల జాబితాను కుదించుకోవలసి వస్తోంది. మెక్ డొనాల్డ్స్ వంటి గొలుసుకట్టు రెస్టారెంట్లకూ ఈ దుస్థితి తప్పడం లేదు. యాప్‌ల ద్వారా ఆర్డరు పెట్టే ఖాతాదారులకు కోరిన వంటకాలు దొరకడం లేదు. ఒక్కోసారి ఉన్నా... వాటిని ఇంటికి తెచ్చి ఇచ్చే సిబ్బందీ లేరు. మరోవైపు కొవిడ్‌వల్ల ఆన్‌లైన్‌లో ఆహారం కోసం ఆర్డరు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది.
ఆ దేశాన్ని విడిచి స్వస్థలాలకు..