తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బైడెన్​-హ్యారిస్​ వస్తే 'పారిస్​'లో అమెరికా చేరినట్టే!

పారిస్​ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు 2017లో సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ట్రంప్​ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే రానున్న అధ్యక్ష ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారితే.. బైడెన్​- హ్యారిస్​ పాలనలో అగ్రరాజ్యం పారిస్​ ఒప్పందంలో తిరిగి చేరే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

Biden-Harris victory may lead US back to Paris climate pact: Experts
బైడెన్​-హ్యారిస్​ వస్తే 'పారిస్​'లో అమెరికా చేరినట్టే!

By

Published : Aug 15, 2020, 1:55 PM IST

2015 పారిస్​ వాతావరణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఉపసంహరించుకోవడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే రానున్న అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్​-కమలా హ్యారిస్​ నేతృత్వంలోని డెమొక్రాట్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. పారిస్​ ఒప్పందంలో అమెరికా రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హ్యారిస్​ వల్లే...!

బైడెన్​​, హ్యారిస్​ ఇద్దరూ పర్యావరణ పరిరక్షణను బలంగా ప్రోత్సహించేవారే. అయితే ఒకవేళ డెమొక్రాట్​ ప్రభుత్వం ఏర్పడి వాతావరణ ఒప్పందంలో అగ్రరాజ్యం తిరిగి చేరితే.. అందుకు కమలా హ్యారిస్​దే కీలక పాత్ర అని నిపుణులు చెబుతున్నారు.

ఉపాధ్యక్షురాలిగా బైడెన్​ ఎంచుకున్న కమలా హ్యారిస్​.. న్యూయార్క్​కు చెందిన అలెగ్జాండ్రియా ఒసాసియో-కార్టెక్స్​తో కలిసి క్లైమేట్​ ఈక్విటీ యాక్ట్​(సీఈఏ) ప్రవేశపెట్టారు.

"వాతావరణం, పర్యావరణం విషయంలో ప్రజలను దృష్టిలో పెట్టుకుని, వారి నిర్ణయాలను పరిగణిస్తూ విధానాలు, నిబంధనలను రూపొందించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది ప్రత్యక్ష విధానాలతో పాటు రవాణా, ఇల్లు, ఉద్యోగాలు, మౌలిక వసతులు సహా మరిన్ని విషయాలకు కూడా వర్తిస్తుంది."

--- క్లైమేట్​ ఈక్విటీ యాక్ట్​.

ఇది అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వాదనకు పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం. ఈ సీఈఏతో పారిస్​ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:-'పారిస్​' నుంచి వైదొలుగుతూ ఐరాసకు అమెరికా లేఖ

హ్యారిస్​ను ఉపాధ్యక్షురాలి పదవికి బైడెన్​ ఎంపిక చేసిన అనంతరం.. పారిస్​ ఒప్పందం అంశంపై స్పందించారు న్యూ క్లైమేట్​ ఇన్​స్టిట్యూట్​ చీఫ్​ నిక్లాస్​ హొన్నె.

"వాతావరణంలో దౌత్య విధానానికి ఇది(హ్యారిస్​ ఎంపిక) కచ్చితంగా మంచి విషయం. బైడెన్​-హ్యారిస్​ కలయిక అంటే.. వాతావరణ విధానాలు, పారిస్​ ఒప్పందంపై రాత్రింబవళ్లు పనిచేస్తున్నట్టే."

--- నిక్లాస్​ హొన్నె, న్యూ క్లైమేట్​ ఇన్​స్టిట్యూట్​ చీఫ్​.

దిల్లీలోని అబ్జర్వర్​-రీసర్చ్​ ఫౌండేషన్​ అధిపతి ఆగ్రీస్​ లైడియా పావెల్​ ఈ విషయంపై స్పందించారు. వాతావరణం అంశంలో ట్రంప్​ విధానాలకు వ్యతిరేకంగా బైడెన్​ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు పావెల్​.

"స్థానిక ఉద్యోగాల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శిలాజ ఇంధనాలను డెమొక్రాట్లు కూడా పూర్తిగా వ్యతిరేకించకపోవచ్చు. కానీ మరింత శుభ్రమైన ఇంధనాల వినియోగానికి ప్రపంచం పరుగులు తీస్తుంది. ఇదే వాస్తవం. వాళ్లు(బైడెన్​-హ్యారిస్​) పారిస్​ ఒప్పందంలో కచ్చితంగా చేరతారు. అందులో అనుమానం లేదు."

-- పావల్​, అబ్జర్వర్​- రీసర్చ్​ ఫౌండేషన్​ చీఫ్​.

పారిస్​ ఒప్పందాన్ని ఉద్దేశించి.. మిత్రపక్షాలతో అమెరికా ఎలా వ్యవహరించాలో, శత్రువులతో ఎలా మసులుకోవాలో తనకు తెలుసని బైడెన్​ తన ప్రచారాల్లో స్పష్టంచేశారు. పారిస్​ ఒప్పందంలోకి అమెరికాను తిరిగి చేర్చడమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణకు బైడెన్​ అంతకుమించిన కృషి చేస్తారని ఆయన ప్రచార వెబ్​సైట్​లో రాసి ఉంది.

2017లో పారిస్​ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఈ ఒప్పందంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. తన దేశం శాశ్వతంగా నష్టపోతుందన్నారు. తన 'అమెరికాకే తొలి ప్రాధాన్యం' విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:-'అమెరికా నిర్ణయం 'పారిస్​' ఒప్పందాన్ని బలహీనపరుస్తుంది'

అమెరికా ఉపాధ్యక్ష పదవిక పోటీ చేస్తున్న తొలి నల్లజాతి మహిళ, ఆసియా అమెరికన్ హ్యారిస్. తన జీవితంలో పర్యావరణ పరిరక్షణకు అనేక విధాలుగా కృషి చేశారు హ్యారిస్​. శాన్​ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా.. ఎన్విరాన్మెంట్​ జస్టిస్​ యూనిట్​ను ఏర్పాటు చేసి ఎన్నో సంఘాలకు సహాయం అందించారు.

(రచయిత- అరునిమ్ భుయాన్)

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details