తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కుంగుతున్న భారతీయుల ఆయుర్దాయం

తీవ్రరూపం దాలుస్తున్న వాయుకాలుష్యం- భారతీయుల  ఆయుర్దాయంలో సగటున ఆరేళ్ల కాలాన్ని హరించివేస్తోంది. ఉత్తరాదిన దాని తీవ్రత మరింతగా పెచ్చుమీరుతోంది.  షికాగో విశ్వవిద్యాలయం నుంచి వెలువడిన 'వాయు నాణ్యతా సూచీ నివేదిక'లోని పలు అంశాలు ఈ మేరకు దిగ్భ్రాంతకర దృశ్యాలను కళ్లకు కడుతున్నాయి. భారత్‌లో 130 కోట్ల జనాభాకు వాయుకాలుష్య ప్రభావిత ప్రాంతాలే ఆవాసాలవుతున్నాయి.

Air pollution
వాయుకాలుష్యం

By

Published : Sep 4, 2021, 7:46 AM IST

గాలే గరళంగా మారి జనావళి ఆయువును తెగ్గోస్తున్న దుర్భరావస్థలో పౌరుల జీవన హక్కు కొల్లబోతోంది. నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్న వాయుకాలుష్యం- భారతీయుల ఆయుర్దాయంలో సగటున ఆరేళ్ల కాలాన్ని హరించివేస్తోంది. ఉత్తరాదిన దాని తీవ్రత మరింతగా పెచ్చుమీరుతోంది. షికాగో విశ్వవిద్యాలయం నుంచి వెలువడిన 'వాయు నాణ్యతా సూచీ నివేదిక'లోని పలు అంశాలు ఈ మేరకు దిగ్భ్రాంతకర దృశ్యాలను కళ్లకు కడుతున్నాయి. భారత్‌లో 130 కోట్ల జనాభాకు వాయుకాలుష్య ప్రభావిత ప్రాంతాలే ఆవాసాలవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం- ప్రతి ఘనపు మీటరు గాలిలో అతిసూక్ష్మ ధూళి కణాలు పది మైక్రోగ్రాములకు మించకూడదు. భారత్‌లో వీటి స్థాయి రెండేళ్ల కిందటే అంతకు ఏడు రెట్లకు పెరిగింది.

దిల్లీలో సగటున 9.7 సంవత్సరాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 9.5 ఏళ్ల మేరకు మానవ జీవనకాలాన్ని అవి దిగలాగేస్తున్నాయి. బిహార్‌, హరియాణా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో సైతం ఆకస్మిక మరణాలు ముమ్మరిస్తున్నాయి. వాయుకాలుష్యం ఇలాగే కొనసాగితే ఉత్తరభారతంలో 51 కోట్ల మంది సగటున ఎనిమిదిన్నర సంవత్సరాల ఆయుష్షును కోల్పోవలసి వస్తుందన్నది పరిశోధనలో నిగ్గుతేలిన విస్మయకర అంశం! వాయుకశ్మలం 2019లో ప్రపంచవ్యాప్తంగా 67 లక్షల మంది ప్రాణాలు తోడేసింది. ఇండియాలోనే 16.7 లక్షల అర్ధాంతర చావులు సంభవించాయి. బాధితుల్లో 1.16 లక్షల మంది పసికందులే! కరోనా లాక్‌డౌన్‌ తరవాత గాలి నాణ్యత కాస్త మెరుగుపడినా, అది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది! సడలింపుల తరవాత విశాఖపట్నం, రాజమహేంద్రవరం, హైదరాబాద్‌ వంటి చోట్ల వాయుకాలుష్యం గతంతో పోలిస్తే పెచ్చరిల్లింది. ఊపిరితిత్తులను నిర్వీర్యం చేసే అతి సూక్ష్మ ధూళి కణాలు భాగ్యనగరంలో నిరుడు 11 వేల మందిని బలిగొన్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ వంటి జిల్లాలూ కాలుష్యభూతం కోరల్లో చిక్కాయి. పోనుపోను ఇంతలంతలవుతున్న వాయుకాలుష్యం మరిన్ని ప్రాణాలను పొట్టన పెట్టుకోకుండా కాచుకోవడం- పాలకశ్రేణుల తక్షణ కర్తవ్యం.

గాలి వడపోత..

దిల్లీలో వాయునాణ్యతను ఇనుమడింపజేసేందుకు ఆప్‌ సర్కారు అక్కడ గాలి వడపోత కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సమస్య మూలాలకు మందు వేయకుండా అటువంటి తాత్కాలిక ఉపశమన చర్యలు ఎన్ని చేపట్టినా నిరర్థకమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నాళ్లుగా పైపైకి ఎగబాకుతున్న వంటగ్యాస్‌ ధరలతో గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిల వాడకం మళ్ళీ ముమ్మరించే అవకాశం అధికమవుతోంది. అదే జరిగితే- గృహ వాయుకాలుష్య కట్టడిలో ఇన్నేళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. భారత్‌లో మూడొంతులకు పైగా నగరాలు, పట్టణాలు కొన్నేళ్లుగా 'గ్యాస్‌ ఛాంబర్ల'ను తలపిస్తున్నాయి. తత్ఫలితంగా గుండెపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు జోరెత్తుతున్నాయి. ఎంపిక చేసిన 122 నగరాల్లో జాతీయ స్వచ్ఛవాయు కార్యక్రమం(ఎన్‌క్యాప్‌) సరైన విధివిధానాలు కొరవడి ఈసురోమంటోంది. పొరుగున జనచైనా కాలుష్యానికి పగ్గాలేసే బహుముఖ వ్యూహాలతో ముందడుగేస్తోంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కర్మాగారాల నిర్మాణాన్ని నిలిపివేసింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వేగం.

ఇదీ చూడండి:covid variant mu: భారత్​లో 'మ్యూ' భయాలు- కొత్త వైరస్​ ప్రమాదకరమా?

ABOUT THE AUTHOR

...view details