తెలంగాణ

telangana

ETV Bharat / opinion

22 Crucial Seats In MP : తాడోపేడో తేల్చే ఆ 22 సీట్లు.. ముస్లిం ఓటు బ్యాంక్​పై కాంగ్రెస్ ఆశలు!.. అధికారం కైవసం చేసుకుంటుందా?

22 Crucial Seats In MP : మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొనే అవకాశాలున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ముస్లిం ఓట్లపైనే కాంగ్రెస్​ భారీ ఆశలు పెట్టుకుంది. 22 స్థానాల్లో ముస్లింలు డిసైడింగ్ ఫ్యాక్టర్​ అవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముస్లింలను ప్రసన్నం చేసుకుంటుందా? మ్యాజిక్​ ఫిగర్​ సీట్లు సాధించి అధికారం చేపడుతుందా? ఈసారి ముస్లింలు మొగ్గుచూపేది ఎటువైపు?

Congress Depends On Muslim Votes In MP
Congress Depends On Muslim Votes In MP

By PTI

Published : Oct 22, 2023, 8:57 PM IST

Updated : Oct 23, 2023, 11:45 AM IST

22 Crucial Seats In MP :మధ్యప్రదేశ్​లో ముస్లిం ఓటర్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ రాష్ట్రంలో తాడోపేడో తేల్చే 22 సీట్లలో ముస్లిం ఓటర్లపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఈసారి ముస్లింలు మొగ్గుచూపేది ఎటువైపు? కాంగ్రెస్​పై వారి అభిప్రాయమేమిటి? ఆ వర్గాన్ని కాంగ్రెస్ ఏ మేర ప్రసన్నం చేసుకోగలదు? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

2018 ఎన్నికల్లో బీజేపీ 41.02 శాతం సాధించి 109 అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ 40.89 శాతం ఓట్లు సాధించింది. బీజేపీ కన్నా కాంగ్రెస్​ కాస్త తక్కువ ఓటు శాతం సాధించినా.. 114 నియోజకవర్గాల్లో గెలుపొందింది. అయితే ఎప్పటి నుంచో మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​, బీజేపీ మధ్య ద్విముఖ పోరు జరుగుతోంది. మధ్యప్రదేశ్​ ఓటర్లు బీజేపీపై కోపం వచ్చినప్పుడు కాంగ్రెస్​కు, కాంగ్రెస్​పై కోపంగా ఉన్నప్పుడు బీజేపీకి పట్టం కడుతున్నారు. అయితే గత ఐదేళ్లలో కాంగ్రెస్​ (15 నెలలు), బీజేపీ (మిగతా కాలం) అధికారం పంచుకున్నాయి. దీంతో ఇప్పుడు మధ్యప్రదేశ్​ ప్రజలు ఎవరికి అధికారం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్​కు ఆశలురేపుతోంది.

ముస్లింలపైనే కాంగ్రెస్ ఆశలు!

Madhya Pradesh Assembly Election 2018 :230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్​లో 47 స్థానాల్లో ముస్లిం ఓటర్లు ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందులో హోరాహోరీ పోరు నెలకొనే 22 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటింగ్​ డిసైడింగ్​ ఫ్యాక్టర్​ కానుంది. '90 శాతం మైనార్టీల ఓట్లు తమకు అనుకూలంగా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు' అని 2018 ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ కమల్​నాథ్​ చెప్పారు. దాని ప్రకారం 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 10-12 సీట్లు ఎక్కువగా గెలవగలిగిందని కాంగ్రెస్‌కు చెందిన మధ్యప్రదేశ్ ముస్లిం వికాస్ పరిషత్ కన్వీనర్ మహ్మద్ మహిర్ అన్నారు. అయితే మహిర్​​ అన్నట్లుగా రాష్ట్రంలో 9-10 శాతం ఉన్న ముస్లింల మద్దతుంటే ఈ సారి కూడా కాంగ్రెస్ సులభంగా మ్యాజిక్ ఫిగర్​ దాటే అవకాశముంది.

ముస్లిం ప్రభావం ఎక్కువ ఉన్న 47 స్థానాల్లో ఓటర్ల సంఖ్య 5 వేల నుంచి 15 వేల మధ్యలో ఉండగా.. 22 నియోజక వర్గాల్లో 15 వేల నుంచి 35 వేల మధ్యలో ఉందని మహిర్​ చెబుతున్నారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకుంటే.. తమ సీట్లను పెంచుకునే అవకాశం ఉంటుంది. 47 సీట్లలో సగానికి పైగా సులభంగా దక్కించుకునే అవకాశం ఉంది. అయితే తమ ముస్లిం అభ్యర్థులకు సంప్రదాయ కాంగ్రెస్​ ఓటర్లను (నాన్-ముస్లింలతో కలిపి) ఆ పార్టీ మళ్లించలేకపోతోందని మహిర్​ పేర్కొన్నారు. ఇదే కనుక నిజమైతే ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకుని.. బూత్​ వరకు వారిని నడిపించడం కాంగ్రెస్​ బాధ్యతే.

ఇక మధ్యప్రదేశ్​లో భోపాల్ నార్త్​, భోపాల్ సెంట్రల్ నియోజకవర్గాల్లోనే ముస్లింల ప్రాతినిధ్యం ఉంది. రెండు స్థానాల నుంచి ఆరిఫ్​ ఇక్బాల్​, ఆరిఫ్​ మసూద్​ 2018 ఎన్నికల్ల పోటీ చేసి గెలిచారు. అంతకుముందు 1998 అసెంబ్లీ ఎన్నికల్లో భోపాల్ నార్త్​, సత్నా స్థానాల్లో ఆరిఫ్​ అకీల్​, ఆరిఫ్​ సయూద్​ గెలుపొందారు. 2003లో బుర్హాన్​పుర్​ నుంచి హమీద్​ ఖాజీ ఎన్నికయ్యారు. అయితే ఈ నియోజకవర్గాల్లో బీజేపీ ముస్లింలను బరిలోకి దింపినా.. సఫలం కాలేకపోయింది. ఈసారి భోపాల్ నార్త్​ స్థానంలో ఆరిఫ్​ ఇక్బాల్​ బదులు.. అతడి కుమారుడు ఆతిఫ్​ ఇక్బాల్​ సిటీ మేయర్​ ఆలోక్ శర్మపై పోటీ చేస్తున్నారు. భోపాల్​ సెంట్రల్ నుంచి ఆరిఫ్​ మసూద్​.. ధృవ్​ నారాయణ్​ సింగ్​పై పోటీకి దిగుతున్నారు. అయితే నాన్​-ముస్లిం ఓట్లు కూడా కూడగడితే ఈ నియోజకవర్గాల్లో​ ఈసారి ముస్లిం అభ్యర్థి ఎన్నికయ్యే అవకాశం ఉంది.

అయితే ముస్లింలను కాంగ్రెస్ మోసం చేసిందని మధ్యప్రదేశ్​ వక్ఫ్​ బోర్ట్​ ఛైర్మన్, బీజేపీ అధికార ప్రతినిధి సన్వర్ పటేల్ ఆరోపించారు. "53 ఏళ్ల పాలనలో ముస్లింలకు ఏం చేయకుండానే.. ఎన్నికల్లో కేవలం ఇద్దరిని నిలబెట్టి 90-100 శాతం కాంగ్రెస్ అనుకుంటోంది. తమ పార్టీ మైనారిటీ వర్గాలకు అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా.. వారి సామాజిక-ఆర్థిక వృద్ధికి హామీ ఇచ్చింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వారు వెనుకబడి ఉన్నారు. బీజేపీ అన్ని వర్గాలను కలుపుకొని పోవడాన్ని విశ్వసిస్తుంది" అని ఆయన చెప్పారు. అయితే, బీజేపీ ఇన్ని చెబుతున్నా ముస్లింలను బీజేపీ ఆకట్టుకోలేకపోతోంది. అది కాంగ్రెస్​కు కలిసివస్తోంది.

అయితే మధ్యప్రదేశ్​లో రెండు జాతీయ పార్టీలకు మ్యాజిక్​ ఫిగర్​కు అటుఇటుగా సీట్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​లా కాకుండా మధ్యప్రదేశ్​లో ముస్లిం ఫ్యాక్టర్​ భారీ స్థాయిలో ప్రభావం చూపించకపోవచ్చని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్​ అసెంబ్లీకి నవంబర్​ 17న ఒకే విడతలో పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడతాయి.

Madhya Pradesh Assembly Election 2018 Result :గత ఎన్నికలల్లో 114 సీట్లు గెలిచి మ్యాజిక్​ ఫిగర్​కు అతి చేరువగా వచ్చిన కాంగ్రెస్.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం 15 నెలల్లోనే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్​ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది.

Madhya Pradesh Election 2023 : మధ్యప్రదేశ్​ అసెంబ్లీకి నవంబర్ 17న పోలింగ్.. బీజేపీ X కాంగ్రెస్​ సంగ్రామంలో విజేత ఎవరో?

Madhya Pradesh Bundelkhand Election : అభివృద్ధితో బీజేపీ.. కులగణనతో కాంగ్రెస్.. అధికారాన్ని కట్టబెట్టే బుందేల్​ఖండ్ ఎవరివైపు?

Last Updated : Oct 23, 2023, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details