తెలంగాణ

telangana

Ministers Live from Sachivalayam

ETV Bharat / live-streaming

LIVE : సచివాలయంలో మంత్రుల మీడియా సమావేశం- ప్రత్యక్ష ప్రసారం

<p>Telangana Ministers Live From Sachivalayam : ప్రజాపాలన దరఖాస్తుల తదుపరి కార్యాచరణపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు. సమీక్ష జరిపిన తదనంతరం, ప్రజాపాలన ప్రత్యేక వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభిస్తున్నారు. అభయహస్తం పథకాల్లో మరో మూడింటిని త్వరలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. &nbsp;ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.&nbsp;</p><p>కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తామన్న <a href="https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/praja-palana-program-ended-in-telangana-huge-response-to-praja-palana-applications/ts20240107072826747747008">గ్యారెంటీలకు<strong> </strong>(</a>Praja Palana Program in Telangana) ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు నిర్వహించిన ప్రజాపాలనలో రాష్ట్రవ్యాప్తంగా 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులు, ఇతర అంశాలపై 19,92,747 ఉన్నాయి. తెలంగాణలో 1,11,46,293 కుటుంబాల పరిధిలోని 16,392 పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. ఈ విషయంలో తదుపరి విచారణపై మంత్రులు చర్చించుకున్నారు. అనంతరం సచివాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.&nbsp;</p>

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 4:33 PM IST

Updated : Jan 8, 2024, 4:57 PM IST

Last Updated : Jan 8, 2024, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details