తెలంగాణ

telangana

Rahul Gandhi

ETV Bharat / live-streaming

LIVE : రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభం - ప్రత్యక్షప్రసారం - భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర లైవ్

<p><strong>Rahul Bharat Jodo Nyay Yatra Live : </strong>కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల వేళ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభమైంది. అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. &nbsp;15 రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల గుండా ఈ యాత్ర సాగునుంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర బస్సుల్లోనే కాకుండా కాలినడకన కూడా 6713 కిలోమీటర్ల దూరం సాగనుంది. ఈ యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాలు 100 లోక్‌సభ స్థానాలు, 337 శాసనసభ నియోజకవర్గాల్లో సాగుతుందని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. మణిపుర్‌లో ప్రారంభమైన ఈ యాత్ర ముంబయిలో మార్చి 20 లేదా 21 తేదీల్లో ముగుస్తుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు &nbsp;కాంగ్రెస్‌ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ వైఫల్యాలను చాటి చెప్పేందుకు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని హస్తం పార్టీ భావిస్తోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక న్యాయం సహా కేంద్ర ప్రభుత్వ విధానాల్లోని వైఫల్యాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.</p>

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 4:04 PM IST

Updated : Jan 14, 2024, 4:20 PM IST

Last Updated : Jan 14, 2024, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details