Minister Jupally Krishna Rao Pressmeet
LIVE : మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావెేశం - ప్రత్యక్షప్రసారం - minister jupally pressmeet live
<p><strong>Minister Jupally Krishna Rao Pressmeet Live : </strong>బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు, అప్పుల తెలంగాణగా మార్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గాంధీభవన్లో మంత్రి జూపల్లి మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వందరోజులు కాకముందే గ్యారంటీలపై రాద్ధాంతం చేయడం తగదన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ఓటమిపాలయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రం బంగారుపళ్లెం కాదు... అప్పుల కుప్పగా ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో జీవోలను బహిర్గతం చేయలేదని.. అన్నీ చీకటి జీవోలు ఇచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. రాష్ట్ర ఆదాయంలో ఇవాళ రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోందన్నారు. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. రెండు ఒకటేనన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే.. అదానీని సీఎం రేవంత్‌రెడ్డి కలిశారన్నారు. గత రెండేళ్లలో కృష్ణా బేసిన్‌లో నిండుగా నీరు ఉన్నప్పటికీ సాగుకు నీరు ఇవ్వలేదన్నారు. </p>
Published : Jan 19, 2024, 12:20 PM IST
|Updated : Jan 19, 2024, 12:28 PM IST
Last Updated : Jan 19, 2024, 12:28 PM IST