Manneguda rto office opening live
LIVE : మన్నెగూడలో ఆర్టీవో కార్యాలయం ప్రారంభోత్సవం - ప్రత్యక్షప్రసారం - Manneguda rto office opening live
<p><strong>Manneguda RTO Office Opening Live :</strong> రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మన్నెగూడలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 2.2 కోట్లతో ఆర్టీవో కార్యాలయాన్ని నిర్మించారు. 5,600 చదరపు గజాల స్థలంలో 10 కౌంటర్లతో ఆర్టీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సీఎస్‌ఆర్‌లో భాగంగా రామోజీ ఫౌండేషన్ ఆర్టీవో కార్యాలయాన్ని నిర్మించింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, జడ్పీ ఛైర్మన్ తీగల అనితారెడ్డి, రామోజీ ఫౌండేషన్ తరఫున ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ , రవాణా శాఖ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా ఆర్టీవో కార్యాలయం ప్రారంభోత్సవం కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూశారని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు తోడ్పాటును అందిస్తున్న రామోజీ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. పెరిగిన జనాభాకు అవసరానికి అనుగుణంగా వాహనల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజల ఇబ్బంది లేకుండా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం వచ్చిందని, త్వరలోనే మున్సిపల్ కార్యాలయాన్ని కూడా నిర్మించుకుందామని పేర్కొన్నారు.</p>
Published : Jan 18, 2024, 12:11 PM IST
|Updated : Jan 18, 2024, 12:45 PM IST
Last Updated : Jan 18, 2024, 12:45 PM IST