తెలంగాణ

telangana

Kite and Sweets Festival Celebrations

ETV Bharat / live-streaming

LIVE : పరేడ్‌ గ్రౌండ్స్‌లో కైట్​ ఫెస్టివల్​ ముగింపు వేడుకలు - ప్రత్యక్ష ప్రసారం - Kites and Sweets Festival

<p><strong>Kites and Sweets Festival at Hyderabad </strong>: సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది. అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్​ను జనవరి 13న మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్​ ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఘనంగా ఈ సంబురాలు జరిగాయి. ఇవాళ ఆ ప్రదేశంలోనే ముగింపు వేడుకలు జరుగుతన్నాయి. కరోనా కారణంగా 2021 నుంచి నిలిచిపోయిన అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్​ను ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.&nbsp;దీనికి తగిన ఏర్పాట్లును చేసి ప్రజలు ఆనందంగా గడిపేలా చేసింది. తెలంగాణ పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇవాళ్టి వరకు ఉత్సవాలను నిర్వహించింది. వేడుకల్లో పాల్గొనేందుకు నగర పౌరులకు ఉచితంగా అవకాశాన్ని కల్పించారు. ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో ప్రజలకు కావాల్సిన వినోదంతో పాటు పసందైన రుచులు కూడా అందుబాటులో తీసుకువచ్చారు. ప్రస్తుతం సికింద్రాబాద్​ పరేడ్​ మైదానం ముగింపు సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.&nbsp;అనంతరం నాయకులు మాట్లాడుతున్నారు.&nbsp;</p>

By ETV Bharat Telangana Team

Published : Jan 15, 2024, 6:35 PM IST

Updated : Jan 15, 2024, 6:52 PM IST

Last Updated : Jan 15, 2024, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details