Kishan Reddy Media Conference Live
LIVE : కిషన్రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం
<p><strong>Kishan Reddy Media Conference Live : </strong>రాష్ట్రంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపునకు బీజేపీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తునకు సీబీఐతో చేయించాలని డిమాండ్ చేశారు.</p><p>దేశంలో మోదీ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి పేర్కొన్నారు. మోదీతో పోటీకి దరిదాపుల్లో లేరని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. నూతన భారత నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేసిందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో అవినీతి లేని ప్రభుత్వం నడుస్తోందని, తొమ్మిదన్నరేళ్లుగా చిత్తశుద్ధితో పాలన సాగుతోందన్నారు. గత ప్రభుత్వాలపై ఏదో రకమైన అవినీతి ఆరోపణలు ఉండేవని, ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు కలిసి కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్లు పెట్టారని ఎద్దేవా చేశారు. </p>
Published : Jan 8, 2024, 5:27 PM IST
|Updated : Jan 8, 2024, 5:42 PM IST
Last Updated : Jan 8, 2024, 5:42 PM IST