తెలంగాణ

telangana

CM Revanth Reddy Opening Numaish Exhibition in Hyderabad

ETV Bharat / live-streaming

నాంపల్లి గ్రౌండ్స్​లో ఎగ్జిబిషన్​ను ప్రారంభించిన సీఎం రేవంత్ - hyderabad Exhibition

<p><strong>CM Revanth Reddy Opening Numaish Exhibition in Hyderabad : </strong>భాగ్యనగరంలో ఎన్నో ఏళ్లుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నుమాయిష్ ఎగ్జిబిషన్​ ప్రారంభమైంది. ​ నాంపల్లిలో ఏర్పాటైన న్యూమాయిష్ ఎగ్జిబిషన్​ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎగ్డిబిషన్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ప్రదర్శనలో ఏర్పాట చేసిన స్టాళ్లను &nbsp;సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సందర్శిస్తున్నారు. 45 రోజుల పాటు కొనసాగే ఈ పారిశ్రామిక ప్రదర్శనలో దేశం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికులు తమ ఉత్పత్తులను పరిచయం చేస్తూ 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్​కు వివిధ ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15న ముగియనుంది.</p><p>నుమాయిష్‌కు భారీ సంఖ్యలో జనాలు వస్తారన్న అంచనాతో ప్రత్యేకంగా మెట్రో రైళ్లు, బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా నగర ప్రజలు ఎగ్జిబిషన్​లో కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులు సూచించారు.</p>

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 5:38 PM IST

Updated : Jan 1, 2024, 5:59 PM IST

Last Updated : Jan 1, 2024, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details