తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Online Business: వాట్సాప్​లో చీరల అమ్మకం.. లాభాల్లో గృహిణి వ్యాపారం - ఆన్​లైన్​ బిజినెస్​తో లాభాలు

సాంకేతికత సరికొత్త అవకాశాలు సృష్టిస్తోంది. ఆన్‌లైన్‌ ఆదాయం అందించే వేదికగా మారింది. ఇంటి పట్టునే ఉండి... ఉపాధి పొందే వెసులుబాటును అందిస్తోంది. వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటుచేసుకొని ఆన్‌లైన్‌లో చీరలు విక్రయిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు కొందరు మహిళలు. జగిత్యాలలో ఓ గృహిణి సైతం సరికొత్త ఆదాయ మార్గంతో ఉపాధిని పొందుతోంది.

women-doing-sarees-business-in-whatsapp-and-its-running-successfully-in-jagtial
Online Business: వాట్సాప్​లో చీరల అమ్మకం.. లాభాల్లో గృహిణి వ్యాపారం

By

Published : Jun 19, 2021, 2:50 PM IST

జగిత్యాలలోని వాణినగర్‌కు చెందిన అయిల్నేని మౌనిక రావు గృహిణి. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపారం చేసి ఉపాధి పొందాలని ఆలోచన చేసింది. తనకు పరిచయం ఉన్నవారి నంబర్లను సేకరించి వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేసి హోల్‌సెల్‌గా చీరలను తెప్పించి గ్రూపులో పోస్ట్ చేసేది. దాని ధరను కూడా అందులో నిర్ణయించి పెట్టేది. చీరలు నచ్చిన వారు వాటి ధరను ఆన్‌లో చెల్లిస్తే.. చీరలను కొరియర్‌ ద్వారా పంపుతున్నారు.. ఇలా నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ఈ వ్యాపారం ఇప్పుడు చాల అభివృద్ధి చెందింది. రోజు 5 నుంచి 6 చీరలను విక్రయిస్తుంది.. సిల్క్‌, పట్టు, ఫ్యాషన్‌ ఇలా అన్ని రకాల చీరలను తెప్పించి ఇంటి వద్దే వ్యాపారం చేస్తోంది. చీరలతో పాటు గిల్టీనగలను కూడా విక్రయిస్తుంది. ఇలా ప్రతి నెలా 20 వేల వరకు ఆదాయం పొందుతోంది.

వారణాసి, చెన్నై, సూరత్‌, బెంగుళూరు వస్త్రాల కంపనీల నుంచి నేరుగా హోల్​ సేల్‌గా చీరలను కొని.. వాటిని ఇతర మహిళలకు విక్రయిస్తోంది. మౌనిక రావు వద్ద నుంచి మరి కొంత మంది చీరలు తీసుకుని.. వారు కూడా వాట్సాప్‌ ద్వారా వ్యాపారం మొదలు పెట్టారు. ఇలా దాదాపు 72 గ్రూపుల ద్వారా వ్యాపారం సాగుతోంది. కరోనా వేళ దుకాణాలకు వెళ్లలేని వారు ఈ ఆన్‌లైన్‌ ద్వారా చీరలను కొంటున్నారు. నమ్మకంగా వ్యాపారం చేయటంతో వ్యాపారం వృద్ది చెందినట్లు మౌనిక రావు తెలిపారు.

ఇదీ చూడండి:పంథా మార్చిన సైబర్ క్రైమ్స్​- ఇలా జాగ్రత్తపడండి..

ABOUT THE AUTHOR

...view details