- వంటింట్లో పొయ్యి వెనుక గోడపై జిడ్డు పేరుకుపోయి ఉంటుంది. దాన్ని స్టీలు పీచుతో అదేపనిగా తోమితే కానీ శుభ్రం కాదు. అది మాటల్లో చెప్పినంత తేలిక కాదు. అందుకే రోజూ మీ పని మొదలు పెట్టడానికి ముందే నీళ్లలో కాస్త వంటసోడా కలిపి గోడపై రాయాలి. పనైపోయిన తరువాత పొయ్యితోపాటూ గోడని శుభ్రం చేయాలి. సులువుగా జిడ్డు వదిలిపోతుంది. లేదంటే ఆయిల్ ప్రూఫ్ రోల్ దొరుకుతుంది. దాన్ని వెనక అతికిస్తే సరి.
- గదులూ, వంటింటి గట్టుని శుభ్రం చేసే వస్త్రాలు ఒకట్రెండు సార్లు తుడిచే సరికి పనికిరావు. ఇందుకోసం ప్రత్యేకంగా లింట్‌ఫ్రీ వస్త్రాలు దొరుకుతాయి.
వంటింట్లో పేరుకున్న జిడ్డును తొలగించేయండిలా..!
జిడ్డుగా మారిన వంటిల్లూ, ఫ్రిజ్ నిండా పేరుకున్న రకరకాల వస్తువులు చూసిన ప్రతీసారీ.. ఈ రోజైనా శుభ్రం చేయాలనుకుంటాం. కానీ చిక్కంతా సమయంతోనే. అందుకే సులువుగా పని పూర్తయ్యేందుకు ఈ చిట్కాలు.
వంటింట్లో పేరుకున్న జిడ్డును తొలగించేయండిలా..!