- తెలుపు రంగు దుస్తుల్ని ఉతికేటప్పుడు ఇతర వర్ణాల వస్త్రాలతో కలపొద్ధు అవి ఎంత పాతవైనా సరే! తెలుపు ఛాయని కాస్తా క్రమంగా రంగు మారేలా చేస్తాయి. వీలైనంతవరకూ వీటిని విడిగా ఉతికితేనే మేలు. లేదంటే ఇతర దుస్తులకు ఉండే మురికి కూడా చేరి వాటి కొత్తదనాన్ని కోల్పోతాయి.
- శరీరం నుంచి వెలువడే చెమట మూలంగానూ తెలుపు రంగు దుస్తులు రంగు మారుతుంటాయి. ఈ పరిస్థితిని నివారించాలంటే ఉతికేటప్పుడు డిటర్జెంట్‌తో పాటు అరకప్పు వంటసోడా కూడా కలపాలి. వాషింగ్ మెషిన్‌లో ఉతికేవారు...తప్పనిసరిగా డ్రమ్ శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి.
- క్లోరిన్ బ్లీచ్ తెలుపు రంగు దుస్తులు మెరుపు కోల్పోనివ్వకుండా కాపాడుతుంది. అయితే దీన్ని కొద్దిగానే వాడాలి. అలానే ఉతికే నీళ్లల్లో కాస్త నిమ్మరసం కలిపితే దుస్తులు రంగు మారవు. ఉతికిన వెంటనే దుస్తుల్ని ఆరేయడం మంచిది.
- పొరబాటున అప్పుడప్పుడు మరకలు పడుతుంటాయి. వీటిని వదిలించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వేడినీళ్లు వాడొద్ధు అలా చేస్తే రంగు మరింత బలంగా అతుక్కుంటుంది. మార్కెట్‌లో వైట్ ట్రీట్‌మెంట్ సొల్యూషన్స్ దొరుకుతున్నాయి. వాటిని వినియోగిస్తే మీ పని సులువు అవుతుంది. వీలైనంతవరకూ మరకపడిన వెంటనే శుభ్రం చేయడం వల్ల మరక త్వరగా వదలగొట్టొచ్చు.
తెల్లటి దుస్తులపై మరకా? అయితే ఇలా చేయండి - white clothes washing tips
ఎంత ఇష్టం ఉన్నా... తెలుపు రంగు దుస్తుల్ని ఎంచుకోవడానికి భయపడుతుంటారు చాలామంది. ఎందుకంటే వాటిమీద చిన్న మరక పడినా... అంత సులువుగా పోదేమో అని సందేహం. అలాంటివారు ఉతికేటప్పుడు ఈ చిట్కాలను పాటించి చూడండి.
tips for white clothes washing