పొట్టిగా పెరిగే చెట్లు, చిన్న చిన్న ఆకులతో ఉండే బహువార్షికాలూ, నేలమట్టంగా పెరిగే సెడమ్స్, రాకరీ, అల్పైన్ వంటి మొక్కల్ని ఉపయోగించి అందమైన మినీయేచర్ గార్డెన్ తయారు చేసుకోవచ్ఛు అయితే ఇవన్నీ ఒకేతరహా వాతావరణాన్ని ఇష్టపడేవి అయి ఉంటే మేలు. ఇందులో చిన్న చిన్న మొక్కలు ఎన్ని ఉన్నా ఓ చెట్టునీ నాటితే చూడ్డానికి బాగుంటుంది.
ఎలా నాటాలంటే... ఇందుకోసం నీరు నిలవని సారవంతమైన మట్టిని ఎంచుకోవాలి. సిరామిక్, టెర్రకోట, చెక్క బాక్సులు ఈ తరహా గార్డెన్‌కి అనువుగా ఉంటాయి. పీట్‌మాస్, పెర్లైట్, వెర్మిక్యులైట్ మాధ్యమం ఇందుకోసం వాడాలి. ముందుగా డిజైన్ చేసుకున్నదాని ప్రకారం మట్టిని నింపుకున్నాక మొక్కల్ని ఓ పద్ధతి ప్రకారం అమర్చుకోవాలి. అది పూర్తయ్యాక ప్రతి మొక్క వేరూ తడిచేలా నీటిని అందించాలి. ఇక ఆ మినీయేచర్ గార్డెన్‌లో మీకున్న స్థలాన్ని బట్టి అందులో అలంకారాల్ని ఏర్పాటు చేసుకోవచ్ఛు రంగు రంగుల బొమ్మల్ని పెట్టొచ్ఛు ఓ చిన్న కొలను ఏర్పాటు చేసుకోవచ్ఛు ఇందుకోసం ఓ చిన్న గుంత తవ్వి చుట్టూ రంగురాళ్లు పేర్చాలి. దానిలో శుభ్రమైన నీళ్లను నింపి చెరువు చుట్టూ గడ్డిజాతిమొక్కల్ని నాటాలి. అప్పుడే అది సహజంగా కనిపిస్తుంది. ఆ చిన్ని తోట చుట్టూ వైర్ ఫెన్సింగ్ వేస్తే మరింత వన్నె వస్తుంది.