తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఈ షవర్​ కప్​తో మీ చిన్నారికి లాల పోసేద్దామిలా..! - special shower bath mug for babies

సాధారణంగా చిన్నపిల్లలకు స్నానం చేయించడమంటే కష్టంతో కూడుకున్న పనే.. వారికి ఒకేసారి నీళ్లన్నీ కుమ్మరిస్తే ఊపిరాడదు కాబట్టి కొద్దికొద్దిగా చిలకరించినట్లు పోస్తారు. మరి ఇందులో కొత్తగా ఈ తరం చిన్నారుల కోసం చిన్ని షవర్​ బాత్​ కప్పులు వచ్చేశాయి. వాటితో చిన్నారులకు షవర్​ లాంటి అనుభూతిని ఇవ్వచ్చు. మీరు ట్రై చేయండి!

special shower bath mug for babies
ఈ షవర్​ కప్​తో మీ చిన్నారికి లాల పోసేద్దామిలా..!

By

Published : Jul 9, 2020, 1:36 PM IST

బుజ్జాయిలకు స్నానం చేయించడం అంత తేలికైన విషయం కాదు. ఒకే సారి చెంబుతో నీళ్లు కుమ్మరిస్తే నెలల బుజ్జాయిలు గుక్క చెప్పుకోలేరు. కొద్దికొద్దిగా చిలకరించినట్టుగా పోస్తే వాళ్లకీ సౌకర్యంగా ఉంటుంది ఇందుకోసం ఈ చిన్ని షవర్ బాత్ కప్​ను ఉపయోగించి చూడండి. పట్టుకునేందుకు వీలుగా ఉండే ఈ షవర్ కప్తో చిన్నారికి లాలపోసేయడం తేలిక.

నీలం, గులాబీ వంటి ప్రకాశమంతమైన రంగుల్లో ఉండే వీటిని చూస్తూ చిన్నారి మరింత ఆనందంగా స్నానం చేయడం ఖాయం. దీనిని తేలికగా శుభ్రం చేయొచ్చు. అలాగే ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు.

ABOUT THE AUTHOR

...view details