తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

smart kitchen : మహిళలకు వంటింట్లో పని భారం తగ్గించే పథకం - ldf party

‘మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఫలానా ఉచితం’... ఇలాంటి హామీల్ని ఎన్నికల ముందు వింటూ ఉంటాం కదా...! కేరళలో ఎల్‌డీఎఫ్‌ పార్టీ కూడా అక్కడి మహిళలకు అలాంటి ఒక హామీనే ఇచ్చింది. అదేంటో తెలుసా..?

smart kitchen scheme launched in kerala
smart kitchen scheme launched in kerala

By

Published : May 30, 2021, 5:28 PM IST

కేరళలోని ఎల్‌డీఎఫ్‌ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి పలు హామీలను ఇచ్చింది. ముఖ్యంగా మహిళలకు ఓ ఆసక్తికర హామీని ఇచ్చింది. "మా పార్టీని గెలిపిస్తే వంటింట్లో మీ పని భారం తగ్గిస్తాం" అన్నది ఆ హామీ. ఇక ఎన్నికల్లో గెలవడంతో ఇచ్చిన మాటని నిలబెట్టుకునేందుకు ఎల్‌డీఎఫ్‌ పార్టీ నేతృత్వంలోని పినరయి విజయన్‌ ప్రభుత్వం స్మార్ట్‌ కిచెన్‌ స్కీమ్‌ని తీసుకురానుంది.

ఇంతకీ ఈ స్కీమేంటంటే... వంటింటిని స్మార్ట్‌గా మార్చుకునేందుకు అవసరమైన గ్రైండర్లు, మిక్సీలు, ఫ్రిజ్‌లు, అవెన్‌లు, డిష్‌వాషర్లు వంటి వాటిని సబ్సిడీ ధరలకే అందిస్తోంది. లబ్ధిదారులు వస్తువు ధరలో మూడోవంతు కడితే చాలు. తక్కిన మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. మగవాళ్లతో సమానంగా స్త్రీలు కూడా ఉత్పాదక రంగంలోకి వచ్చినప్పుడే సంపదని సృష్టించగలుగుతాం. కానీ సగం కంటే ఎక్కువ మంది స్త్రీలు రోజంతా వంటింట్లోనే గడిపేస్తుంటే ఆర్థికంగా స్త్రీలు వెనుకబడతారనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట.

ఇదీ చూడండి: Vairamuthu: ఈ అవార్డు వద్దు.. తిరిగి ఇచ్చేస్తున్నా!

ABOUT THE AUTHOR

...view details