షెజ్వాన్ మష్రూమ్స్
కావలసినవి
పుట్టగొడుగు ముక్కలు: రెండు కప్పులు, ఉల్లిపాయ: ఒకటి, క్యాప్సికం: ఒకటి, క్యారెట్ తరుగు: పావుకప్పు, క్యాబేజీ తరుగు: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, మొక్కజొన్నపిండి: చెంచా (నీళ్లతో పల్చగా కలుపుకోవాలి), టొమాటోసాస్: రెండు చెంచాలు, షెజ్వాన్ సాస్: రెండు టేబుల్‌స్పూన్లు(బజార్లో దొరుకుతుంది), వినెగర్: అరచెంచా, సోయాసాస్: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: మూడు చెంచాలు, కారం: రెండు చెంచాలు, గరంమసాలా: అరచెంచా.
తయారీ విధానం
స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, పుట్టగొడుగు ముక్కలు, క్యాబేజీ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం, క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించాలి. పుట్ట గొడుగు ముక్కలు మెత్తగా అయ్యాక టొమాటోసాస్, మొక్కజొన్నపిండి మిశ్రమం, తగినంత ఉప్పు, సోయాసాస్, వినెగర్, షెజ్వాన్ సాస్, కారం, గరంమసాలా వేసి బాగా కలిపి అయిదు
నిమిషాలయ్యాక దింపేయాలి.
మసాలా కర్రీ
కావలసినవి
పుట్టగొడుగులు: అరకేజీ, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి పెద్దది, అల్లంవెల్లుల్లి ముద్ద: మూడు చెంచాలు, టొమాటో గుజ్జు: పావుకప్పు, పసుపు: అరచెంచా, కారం: రెండు చెంచాలు, గరంమసాలా: చెంచా, ఉప్పు: తగినంత,
జీడిపప్పు పలుకులు: పావుకప్పు (పది నిమిషాలు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి), కసూరీమేథీ: టేబుల్‌స్పూను, కొత్తిమీర: కట్ట.
తయారీ విధానం
స్టౌమీద కుక్కర్‌ని పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో గుజ్జు, పసుపు, కారం, గరంమసాలా, తగినంత ఉప్పు, పుట్టగొడుగు ముక్కలు వేసి బాగా కలిపి పావుకప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఒక కూత వచ్చాక దింపేయాలి. ఆ తరువాత ఈ కూరను మళ్లీ స్టౌమీద పెట్టి కసూరీమేథీ, జీడిపప్పు ముద్ద, కొత్తిమీర తరుగు వేసి కలిపి కాసేపయ్యాక దింపేయాలి.
గార్లిక్ ఫ్రై