వంటింట్లో..
వంటింట్లో... కూరగాయలు కడగడం, కోయడం, పాత్రలు శుభ్రం చేయడం... ఇలా రకరకాల పనులన్నీ దీని చుట్టుపక్కలే చేస్తుంటాం. దీనిపై బోలెడు సంఖ్యలో సూక్ష్మజీవులు ఆవాసం ఉంటాయి. కాబట్టి ఈ బండను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. డిటర్జెంట్ కలిపిన నీటితో శుభ్రం చేసి పొడి వస్త్రంతో తుడవాలి.
సింకు
సింకు...జిడ్డు పాత్రలు, మిగిలిపోయిన ఆహార వ్యర్థాలు.... ఇలా చూడటానికి చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది. ఇక్కడే పాత్రలు శుభ్రం చేస్తాం. అయితే దీన్ని కూడా ఎప్పటికప్పుడు కడిగేయాలి. వెనిగర్, వంటసోడాలను సమాన పరిమాణాల్లో తీసుకుని వేడినీటిలో కలపాలి. ఈ నీటిలో స్పాంజ్‌ను ముంచి దాంతో సింకుని శుభ్రం చేయాలి.
ఫ్రిజ్
ఫ్రిజ్... పదార్థాల కోసం దీన్ని పదే పదే తెరుస్తున్నప్పుడు మన చేతికి ఉండే క్రిములన్నీ ఫ్రిజ్ డోర్‌పై ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఇదిలా కొనసాగితే కొత్త ఇబ్బందులు తప్పవు. కాబట్టి రెండు మూడు రోజులకోసారి ఫ్రిజ్ శుభ్రత విషయంలో కాస్త పట్టించుకోవాలి. ఓ పాత్రలో కొన్ని నీళ్లు పోసి అందులో చెంచా ఉప్పు లేదా వంటసోడా కలపాలి. ఈ నీటిలో శుభ్రమైన వస్త్రాన్ని ముంచి ఫ్రిజ్‌నంతా తుడవాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడిస్తే సరి.