తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఖర్చులు తగ్గించుకుందాం ఇలా! - వృథా ఖర్చులు తగ్గింపు

మన అవసరాలను తీర్చేది, అండగా ఉండేది డబ్బు. ఉన్నప్పుడు దుర్వినియోగం చేస్తే, అవసరం అయినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా కాకూడదంటే ఈ పద్ధతులను పాటించండి అంటున్నారు ఆర్థిక నిపుణులు.

how-to-save-money
ఖర్చులు తగ్గించుకుందాం ఇలా!

By

Published : May 6, 2021, 11:28 AM IST

* మెప్పు కోసం వద్దు!

చాలామంది ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అని గొప్పలకి పోయి తిప్పలు తెచ్చుకుంటారు. షాపింగ్‌ చేసేటప్పుడు అవసరానికి మించి కొంటుంటారు. అవి పనికొస్తాయో లేదో కూడా ఆలోచించరు. మీ ఖర్చు మీకు సంతృప్తినివ్వాలి కానీ ఎదుటివాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగించకూడదు. అలా చేస్తే ఇబ్బందులు పడేది మీరే.

*ఆచితూచి..

కొందరు వచ్చే సంపాదనను చూసుకోకుండా ఖర్చులు పెట్టేస్తారు. తర్వాత జీతం వచ్చేవరకూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. అందుకే ఎంత వస్తోంది... ఎంత ఖర్చవుతోంది... లెక్కలు రాసుకోండి. దాన్ని బట్టి ఆచితూచి ఖర్చు చేసుకుంటే ఏ సమస్యా ఉండదు.

* అత్యవసరానికే...

మరికొంతమంది వినోదాలకు, విహార యాత్రలకు, వృథా చిల్లర ఖర్చులకి అప్పులు తీసేసుకుంటారు. వాడినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఖర్చంతా పెరిగి చివరికి లోన్లు కట్టలేక, జీతం అంతా వాటికే కట్‌ అయిపోతుంది. అందువల్ల మరీ అత్యవసరమైతే తప్ప లోన్ల జోలికి పోకండి.

ఇక చివరిగా... చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, పేదరికాన్ని తిట్టుకుంటూ ఉంటారు. అలా కుంగిపోతూ ఉంటే ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం తప్ప ఇంకేమీ ఒరగదు. కాబట్టి ఆర్థిక సూత్రాలను పాటించి సమస్యల నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తూ సాగిపోవాలి.

ఇదీ చూడండి:స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 50 ప్లస్​

ABOUT THE AUTHOR

...view details