పడకగదితో మొదలు:
చాలా మంది తలగడలను సంవత్సరాలు తరబడి వాడుతూ ఉంటారు. ఆరు నెలలకోసారి పాతవాటిని తీసేయాలి. వాటినే వాడుతూ ఉంటే అలెర్జీల బారినపడే ప్రమాదం ఉంది. ఇంట్లో మాసిన దుస్తులను ఒక చోట వేసేసి అలా వదిలేయకూడదు. వాటి నుంచి వచ్చే దుర్వాసన జలుబూ, దగ్గూ రావడానికి కారణం అవుతుంది.
నిద్రకు ముందు:
వంటంతా పూర్తయిన తర్వాత పొయ్యిని శుభ్రం చేయడం మర్చిపోవద్దు. వంట చేసేటప్పుడు పొంగిన పాలు, టీ వంటివి స్టవ్ పైభాగం, బర్నర్లలోకి చేరిపోతాయి. వాటిని అలాగే వదిలేస్తే బొద్దింకలు, ఇతర కీటకాలు స్టవ్ చుట్టూ చేరతాయి. ఇవి మన భోజనాన్ని అనారోగ్యభరితం చేస్తాయి.
ఇదీ చూడండి:కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ తొలిదశ విజయవంతం